మోడ్రన్ లుక్ లో కనువిందు చేసే సన్నింగ్ బ్యూటీ పూజా హెగ్డే, సాంప్రదాయం ఉట్టిపడే చీరకట్టులో చిరునవ్వులొలికించింది. ఈ నయా లుక్ తన సోదరుడి పెళ్లికోసం కాగా.. పీచ్ కలర్ శారీ, చీరకు మేచ్ అయ్యే చెవిపోగులు, నెక్లెస్ ధరించిన ఈ జిగేల్ రాణి పట్టరాని ఆనందంతో ఫోజులిచ్చింది.
అయితే అంతకు మందు పెళ్లి మండపంలో ఫ్యామిలీతో కలిసి నానా హంగామా చేసిన పూజ..ఈ చీర కట్టులో సింగిల్ ఫొటో షూట్ నిర్వహించుకుంది. ఈ క్రమంలోనే ఇన్‌స్టా వేదికగా షేర్ చేస్తూ.
‘వెడ్డింగ్ ఫీవర్. మంగళూర్ డైరీస్. మేరా బాయ్ కృష్ణ షాదీహై’ అంటూ క్యాప్షన్ రాసుకొచ్చింది. ప్రస్తుతం వైరల్ అవుతున్న పిక్స్ పై పాజిటివ్ కామెంట్లతో ఖుష్ అవుతున్న ఫ్యాన్స్ ‘సౌత్ ఇండియన్ స్టైల్’, ‘బుట్ట బొమ్మ కుందనపు బొమ్మలా మారింది’ అంటూ పొగిడేస్తున్నారు.