కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ఆచార్య. ఈ చిత్రంలో చిరంజీవితో పాటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న సంగతి తెలిసిందే. చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ నటిస్తుండగా రామ్ చరణ్ సరసన నటించేందుకు పూజా హెగ్డే కు అవకాశం వచ్చింది. కానీ ఈ సినిమా చేసేందుకు పూజా ఓ కండిషన్ పెట్టిందట. సౌత్ ఇండియా లో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోయిన్ల జాబితాలో ఉన్న పూజా ఈ సినిమాకు పూర్తిస్థాయి రెమ్యునరేషన్ ఇస్తేనే నటిస్తానని కండిషన్ పెట్టిందట.
అయితే మొదట నిర్మాతలు ఆలోచించినప్పటికీ పూజకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. మామూలుగా ఒక పూర్తిస్థాయి సినిమాకు ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటుందో ఆచార్య లో చిన్నపాటి రోల్ కు అంతే రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు ఫిల్మ్ నగర్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.