టాలీవుడ్ లో ప్రస్తుతం స్టార్ హీరోయిన్ కావాల్సి ఉన్నా సరే వెనకడుగు వేస్తున్న హీరోయిన్ పూజ హెగ్డే. ఒకప్పుడు మంచి విజయాలతో భారీగా రెమ్యునరేషన్ పెంచేసింది ఈ అమ్మడు. అయితే కెరీర్ లో ఇప్పుడు మంచి హిట్ కోసం ఎదురు చూస్తుంది. అటు తమిళం లో కూడా ఆమెకు అనుకున్న విధంగా పరిస్థితి కనపడటం లేదు. కన్నడం లో కూడా ఆమెను దాదాపుగా పక్కన పెట్టారు.
బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ తో చేసిన సినిమా కూడా షాక్ ఇచ్చింది. షారుఖ్ సినిమాలో నటించే అవకాశం ఉందనే ప్రచారం కూడా జరుగుతుంది. ఇదిలా ఉంచితే ఇప్పుడు పూజ హెగ్డేకి ఒక సినిమా నుంచి దరిద్రం పట్టుకుంది అంటున్నారు ఫాన్స్. అదే రాధేశ్యాం. రాధాకృష్ణ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా దారుణంగా ఫ్లాప్ అయింది. ప్రభాస్ ఇమేజ్ కూడా కాస్త దెబ్బ తిన్నట్టే కనపడింది.
టైం ట్రావెల్ తో ఉండే ఈ సినిమాలో పూజ నటన బాగున్నా సినిమా మాత్రం ఆడలేదు. ఇక అక్కడి నుంచి ఆమెకు వస్తున్న ఆఫర్లు కూడా పోతున్నాయి. ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో ఆమె నటిస్తున్నా తర్వాతి సినిమాల మీద క్లారిటీ రావడం లేదనే చెప్పాలి. ఇక అల్లు అర్జున్ తో కలిసి ఒక సినిమా చేసే అవకాశం ఉందనే ప్రచారం సైతం జరుగుతుంది.