నటీనటులతో సినిమాతో అనుబంధం అగ్రిమెంట్ వరకే. అది పూర్తయిన వెంటనే మరో సినిమాకు షిఫ్ట్ అయిపోతారు. అంతగా ఎటాచ్ మెంట్ పెట్టుకోరు. హీరోయిన్ల విషయంలో ఇది మరీ ఎక్కువ. ఇప్పుడు రాధేశ్యామ్ విషయంలో పూజాహెగ్డే పరిస్థితి కూడా ఇంతే. మరో 3 రోజుల్లో రిలీజ్ కాబోతున్న ఈ సినిమాకు సంబంధించి పూజాహెగ్డే దూరమైంది.
అగ్రిమెంట్ లో భాగంగా కొన్ని రోజుల పాటు రాధేశ్యామ్ కు ప్రచారం చేయడానికి పూజాహెగ్డే ఒప్పుకుంది. అంగీకరించినట్టుగానే ప్రభాస్ తో కలిసి ముంబయి, చెన్నై ఈవెంట్లలో పాల్గొంది. టాలీవుడ్ లో ఇద్దరూ కలిసి కొన్ని ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఆ తర్వాత పూజా కూడా సోలోగా ఇంకొన్ని ఇంటర్వ్యూలు ఇచ్చింది. వీటితో ఆమె అగ్రిమెంట్ పూర్తయింది.
ఇక రాధేశ్యామ్ సినిమాకు సంబంధించి ప్రత్యక్షంగా ఆమె ప్రచారంలో పాల్గొనదు. ఏమైనా ప్రమోషనల్ కంటెంట్ ఉంటే సోషల్ మీడియాలో ఆమె టీమ్ పోస్ట్ చేస్తుందంతే. అది కూడా సినిమా విడుదలైన మరో వారం రోజుల వరకు మాత్రమే. వ్యక్తిగతంగా రాధేశ్యామ్ యూనిట్ కు పూజా హెగ్డే దూరమైనట్టే లెక్క.
అయితే ఇక్కడో మరో చిన్న కండిషన్ మిగిలిపోయింది. సినిమా సూపర్ సక్సెస్ అయి, సక్సెస్ మీట్ లేదా భారీ ఈవెంట్ చేయాల్సి వస్తే మాత్రం పూజా హెగ్డే మరోసారి రావాల్సి ఉంటుంది. దానికి ఎక్స్ ట్రా పేమెంట్ అనే క్లాజ్ కూడా యాడ్ చేసినట్టు తెలుస్తోంది. మొత్తమ్మీద రాధేశ్యామ్ తో పూజాహెగ్డేకు ఇక సంబంధం లేనట్టే