పవన్ కల్యాణ్-హరీశ్ శంకర్ కాంబినేషన్ లో రావాల్సిన భవదీయుడు భగత్ సింగ్ సినిమా నుంచి పూజా హెగ్డే తప్పుకుందనేది అందరికీ తెలిసిన వార్త. ఇంకా చెప్పాలంటే ఈ న్యూస్ ఇప్పుడు పాతదైపోయింది. దీనికి ఓ సరికొత్త అప్ డేట్ వచ్చింది. తాజా సమాచారం ప్రకారం.. పవన్ సినిమా నుంచి తప్పుకున్న ఈ బ్యూటీ, ఆ కాల్షీట్లను నేరుగా హీరో రామ్ కు కేటాయించిందట.
దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రానప్పటికీ, పూజాహెగ్డే దాదాపుగా రామ్ కు కాల్షీట్లు కేటాయించిందనేది ఇండస్ట్రీ టాక్. రీసెంట్ గా బోయపాటి దర్శకత్వంలో సినిమా ఎనౌన్స్ చేశాడు రామ్. ఈ సినిమాలో హీరోయిన్ గా పూజా హెగ్డేను తీసుకుంటున్నారట. పవన్ కు కేటాయించిన కాల్షీట్లు ఖాళీగా ఉండడంతో, వెంటనే పూజా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది.
రామ్ ఎప్పుడూ స్టార్ హీరోయిన్ల వెంట పడడు. తన సినిమాకు అందుబాటులో ఉన్న హీరోయిన్లను మాత్రమే తీసుకుంటాడు. రామ్ సరసన నటించిన స్టార్స్ అయిన హీరోయిన్లు ఉన్నారు కానీ, స్టార్ స్టేటస్ వచ్చిన తర్వాత రామ్ సినిమాల్లో కనిపించిన వాళ్లు చాలా తక్కువ. కానీ తొలిసారి పూజాహెగ్డే లాంటి స్టార్, రామ్ సినిమాలో కనిపించబోతోంది.
ప్రస్తుతానికి ఇది గాసిప్ లెవెల్లోనే ఉంది. కార్యరూపం దాలిస్తే మాత్రం రామ్-పూజా రూపంలో సిల్వర్ స్క్రీన్ పై ఓ ఫ్రెష్ కాంబినేషన్ ను ఆడియన్స్ చూస్తారు. ఇదొక మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్.