పూజాహెగ్డే మళ్ళీ పుంజుకుంది. వ్యక్తిగత కారణాలు దృష్ట్యా మేకప్ కి దూరమైన మన బుట్టబొమ్మ పెర్ఫార్మెన్స్ కి పచ్చజెండా ఊపేసింది. సల్మాన్ మూవీ షూటింగ్ లో కాలికి గాయం కావడం, బ్రదర్ మ్యారేజ్ సెలబ్రేషన్స్ లో బిజీగా ఉండటంతో గత కొంతకాలంగా షూటింగ్ కు దూరమైంది పూజ.
రీసెంట్ గా జిమ్ లో వర్క్ అవుట్ లు చేస్తున్న ఫొటోలు, షూటింగ్ సెట్ లో హెయిర్ స్టైలిష్ చేసుకుంటున్న ఫొటోలను షేర్ చేసింది. ఈ ఫోటో ద్వారా బ్యాక్ టూ షూటింగ్ అనే విషయాన్ని క్లారిటీ ఇచ్చింది. సూపర్ స్టార్ మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాలో పూజ హీరోయిన్ గా చేస్తున్న విషయం తెలిసిందే.
ఈ సినిమా షూటింగ్ జనవరిలో మొదలైంది. ఈ మూవీలో పూజా హెగ్డేతో పాటు యంగ్ బ్యూటీ శ్రీలీల కూడా హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే త్రివిక్రమ్.. పూజా కాంబోలో తెరకెక్కిన అరవింద సమేత, అల వైకుంఠపురంలో సినిమాలు భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే.