యాంటెన్నా పెడుతున్న శ్రీదేవి - Tolivelugu

యాంటెన్నా పెడుతున్న శ్రీదేవి

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఇప్పటి దాకా సాఫ్ట్ హీరో..! ‘ముకుంద’ మూవీలో ఫ్యామిలీ లుక్స్‌లో కనిపించిన ఈ హీరో తరువాత దాదాపు తన సినిమాలన్నింట్లో అదే ఇమేజ్ మెయింటేన్ చేస్తూ వస్తున్నాడు. మధ్యలో ఒకసారి పూరీ మూవీలో కొంచెం రఫ్ అడ్ టఫ్‌గా కనిపించాడు. ఇప్పుడు పూజాహేగ్డేతో జతకట్టి ‘వాల్మీకి’లో మాస్ అప్పీల్‌తో ముందుకొస్తున్నాడు వరుణ్.  పవర్‌స్టార్ బర్త్‌డే సందర్భంగా వరుణ్ తేజ్ ట్విట్టర్ ద్వారా వాల్మీకి పోస్టర్ రిలీజ్ చేసి ఫాన్స్‌కు వినాయక చవితికి గిఫ్ట్ ఇచ్చాడు..!

ఈనెల 20న ఈ మూవీ రిలీజ్ అవుతోంది. పోస్టర్ చూస్తే మెగాస్టార్ చిరంజీవి యమకింకరుడు రోజుల నాటి మాస్ లుక్స్ కనిపించాయి. అంటే వాల్మీకి ద్వారా వరుణ్ మాస్ హీరోగా ఎలివేట్ చేయడానికి రంగం సిద్ధం అయింది. అచ్చం పాత చిరంజీవి మాస్ పోజు భలేగా ఉంది.
వరుణ్ కెరీర్‌లో వాల్మీకి మరో మలుపు కావచ్చని ఫాన్స్ అంచనా..! అమాయకత్వం, రౌద్రం, పౌరుషం, దుడుకుతనం కలబోసిన వాల్మీకి కేరెక్టర్ పోస్టర్‌లో ఎలివేట్ అయింది. తమిళ్ హిట్ సినిమా ‘జిగర్డాండ’ను రీమేక్‌గా ఈ మూవీ వస్తోంది. గబ్బర్‌సింగ్ వంటి సూపర్ డూపర్ హిట్ ఇచ్చిన హరీశ్ శంకర్ దీనికి డైరెక్టర్.

పల్లెటూరి పడుచు పాత్రలో పూజా చేస్తోంది. సినిమాలో ఆమె పాత్ర పేరు శ్రీదేవి అని ఈమధ్యనే ఒక పోస్టర్ ద్వారా రివీల్ చేశారు. శ్రీదేవీ పాతకాలం నాటి యాంటెన్నా పట్టుకుని సిగ్నలింగ్ కోసం ప్రయత్నిస్తుంటే, వరుణ్ డాబా పిట్టగోడ మీద పడుకుని చూస్తున్నాడు. దీన్ని బట్టి కథాంశం ఇప్పటిది కాదని అర్ధం అవుతోంది.

Share on facebook
Share on twitter
Share on whatsapp