లాక్ డౌన్ నేపథ్యంలో ఇంటికే పరిమితం అయిన సెలబ్రిటీలు సోషల్ మీడియా ద్వారా అభిమానులకు టచ్ లోకి వస్తున్నారు. తాజాగా పూజా హెగ్డేకు ఓ అభిమాని మీతో కలిసి నటించిన హీరోలలో ఎవరితో స్వీయనిర్బంధంలో ఉండాలనుకుంటారు? వారి నుంచి ఏమి నేర్చుకుంటారంటూ ప్రశ్నించాడు. దానికి సమాధానంగా నేనిప్పటివరకు మహేష్ బాబు, అల్లు అర్జున్, ఎన్టీయార్, హృతిక్ రోషన్, అక్షయ్ కుమార్, ప్రభాస్ వంటి హీరోలతో కలిసి పనిచేశాను.
అవకాశమొస్తే అందరినీ స్వీయనిర్బంధంలోకి తీసుకుని వారి నుంచి అనేక విషయాలు తెలుసుకుంటా. అలా కాకుండా ఒక్కరితోనే అయితే.. నేను హృతిక్ రోషన్‌ను ఎంచుకుంటా. చిన్నప్పటి నుంచి అతను నా కలల హీరో. బాలీవుడ్‌లో నా తొలి సినిమా హృతిక్‌తోనే. ఆయన అనేక విషయాల్లో నాకు స్ఫూర్తి. ఆయన నుంచి ఎన్నో విషయాలు నేర్చుకుంటానని చెప్పుకొచ్చింది.