బాలీవుడ్ హీరోయిన్లు అందరికీ ఓ చెడ్డ అలవాటు ఉంది. ఏరుదాటిన తర్వాత తెప్ప తగలేసే రకాలు చాలామంది. ఉదాహరణకు తాప్సినే తీసుకుందాం. టాలీవుడ్ లో గుర్తింపు తెచ్చుకొని, టాలీవుడ్ లో డబ్బు సంపాదించి.. బాలీవుడ్ కు వెళ్లిన తర్వాత అదే టాలీవుడ్ ను విమర్శించింది. తెలుగువాళ్లకు సినిమా తీయడం రాదు అన్నట్టు కామెంట్ చేసింది.
తాప్సి టైపులో టాలీవుడ్ ను కించపరిచే వ్యాఖ్యలు చేసిన హీరోయిన్లు చాలామంది ఉన్నారు. కానీ పూజా హెగ్డే మాత్రం అలా కాదు. తనకు లైఫ్ ఇచ్చిన టాలీవుడ్ ను గుండెల్లో పెట్టుకొని చూసుకుంటానని చెబుతోంది. తన ప్రపంచం టాలీవుడ్ అంటోంది. ప్రస్తుతం తెలుగు నుంచి ఇంకా అవకాశాలు వస్తున్నాయి కాబట్టి, ఆమె ఇలా అంటోందని అనుకోవడానికి వీల్లేదు.
పూజాహెగ్డే ఇప్పుడు బాలీవుడ్ లో కూడా పాపులర్ అయింది. ఏకంగా సల్మాన్ ఖాన్ సరసన నటిస్తోంది. రణ్వీర్ సింగ్ లాంటి స్టార్ హీరోతో కలిసి సినిమా చేస్తోంది. లిస్ట్ లో ప్రకటించకుండా మరో 3 పెద్ద సినిమాలున్నాయి. కాబట్టి ఆమె కూడా టాలీవుడ్ ను లైట్ తీసుకోవచ్చు.
కానీ పూజాహెగ్డే మాత్రం అలాంటి తప్పుడు స్టేట్ మెంట్స్ ఇవ్వడం లేదు. తనకు సర్వస్వం టాలీవుడ్ అంటోంది. తన కెరీర్ కు పిల్లర్ గా నిలిచిన ఇండస్ట్రీగా టాలీవుడ్ ను చెప్పుకొస్తోంది. జీవితాంతం టాలీవుడ్ ను గుర్తుచేసుకుంటానని అంటోంది.