బుట్ట బొమ్మ పూజా హెగ్డే వరుస సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతోంది. బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ టాలీవుడ్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , అఖిల్ , ప్రభాస్, మహేష్ బాబు ఎన్టీఆర్ లతో వరుస సినిమాలను చేస్తోంది. అలాగే ఆచార్య సినిమాలో కూడా రామ్ చరణ్ కు జోడీగా నటిస్తోంది. తమిళ్ లో విజయ్ దళపతి బీస్ట్ సినిమాలో నటిస్తోంది.
Advertisements
ఇలా వరుస సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్న ఈ అమ్మడుకి నితిన్ సినిమాలో కూడా ఆఫర్ వచ్చిందట. మాచర్ల నియోజకవర్గం సినిమాలో పూజా హెగ్డే ని మొదటి సంప్రదించగా….ఆమె బిజీగా ఉన్నానని నో చెప్పిందట. భారీ రెమ్యునరేషన్ ఆఫర్ చేసినా కూడా డేట్స్ ఖాళీ లేవంటూ నో చెప్పిందట. ఆమె ప్లేస్ లో కృతి శెట్టిని హీరోయిన్ గా తీసుకున్నారు.