పూజా హెగ్డే ..అందం,అభినయం కలగలిసిన బాలీవుడ్ భామ. ముకుంద సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టి టాప్ రేంజ్ కి చేరుకున్న హీరోయిన్. అప్పుడప్పుడూ ఐటెం సాంగ్స్ లో కనిపించి కుర్రకారుని కిర్రెక్కించింది ఈ జిగేల్ రాణి.
సినిమా అనేది లాటరీ లాంటిది. ఏ సినిమా హిట్ అవుతుందో ఏ సినిమా ఫట్ అవుతుందో ఊహించడం కష్టం. ఒక సినిమా హిట్ అయితే హీరోకి రెమ్యూనిరేషన్ ఇట్టే పెంచేస్తారు..కానీ, ఒక సినిమా ప్లాప్ అయితే మాత్రం రెమ్యూనిరేషన్స్ తగ్గించరు.
అందుకు కారణం వారి స్టార్ డమ్. అయితే ఇదే ఫార్ములా హీరోయిన్ల విషయంలో సెట్ కావడం లేదు. వరుసగా ప్లాపులు వచ్చిన హీరోయిన్స్ కు మాత్రం రెమ్యూనిరేషన్ విషయంలో తేడా ఉంటుంది.
తాజాగా ఇదే పరిస్థితిని ఎదుర్కొంటుంది హీరోయిన్ పూజా హెగ్డే. గత ఏడాది నుంచి ఇప్పటివరకు పూజాకు ఒక్క హిట్ లేదు. రాధేశ్యామ్, బీస్ట్, ఆచార్య ఏది ఆమెకు కలిసిరాలేదు.. అంతకు ముందు గోల్డెన్ లెగ్ అన్నవారే ఇప్పుడు ఆమెను ఐరన్ లెగ్ అంటూ ముద్ర వేశారు.
ఇక ప్రస్తుతం పూజా.. మహేష్- త్రివిక్రమ్ సినిమాలో నటిస్తోంది.. మరోపక్క హిందీలో సల్మాన్ సరసన నటిస్తోంది. ఈ రెండు సినిమాలు రిలీజ్ కు సిద్ధమవుతున్నాయి. ఈ రెండు సినిమాల రిజల్ట్ ఈ ఉంటుంది అనేది ఎవరు చెప్పలేరు. ఈలోపు కొత్త సినిమాలను లైన్లో పెట్టడానికి పూజా బాగా కష్టపడుతుంది.
అయితే కొత్త అవకాశాలు రావాలంటే మాత్రం పూజా ఒక కండిషన్ కు ఒప్పుకోవాలని నిర్మాతలు చెప్పుకొస్తున్నారట. అదే రెమ్యునిరేషన్ తగ్గించుకోవడం..హిట్లు వచ్చినప్పుడు పూజా బాగానే డిమాండ్ చేసి కోట్లు అందుకుంది.
ఇప్పుడు ఆమె వరుస ప్లాప్ ల్లో ఉండడంతో ఆఫర్లు కావాలంటే రెమ్యూనిరేషన్ తగ్గించుకోక తప్పదు అంటున్నారట. ఒక్కో సినిమాకు రూ. 50 లక్షలు తగ్గించుకోవాలని డిమాండ్ చేస్తున్నారట. మరి ఈ విషయంలో పూజా ఎలా స్పందిస్తుందో చూడాలి.