సౌత్ హీరోయిన్లలో అత్యథిక పారితోషికం తీసుకుంటున్న ముద్దుగుమ్మ ఎవరు? ఈ ప్రశ్నకు ఒకే ఒక్క సమాధానం నయనతార. ఆమె స్థాయిలో మరే హీరోయిన్ రెమ్యూనరేషన్ అందుకోవడం లేదు. ఒక్కో సినిమాకు అటుఇటుగా 5 నుంచి 6 కోట్ల రూపాయలకు రెమ్యూనరేషన్ తీసుకుంటుంది నయనతార. మరి నయనతార తర్వాత రెండో స్థానం ఎవరిది?
మొన్నటివరకు పారితోషికం విషయంలో రష్మిక, పూజాహెగ్డే మధ్య చిన్నపాటి పోటీ ఉండేది. ఇప్పుడు రష్మికను అధిగమించింది పూజాహెగ్డే. నయనతార తర్వాత అత్యధిక పారితోషికం తీసుకుంటున్న ముద్దుగుమ్మగా రికార్డ్ సృష్టించింది.
ప్రస్తుతం ఒక్కో సినిమాకు 5 కోట్ల రూపాయలు తీసుకుంటోంది పూజా హెగ్డే. ఇందులో 4 కోట్ల రూపాయలు ఆమె రెమ్యూనరేషన్. మిగతా కోటి రూపాయలు ఆమె స్టాఫ్ జీతాలు. ఈ 5 కోట్ల మొత్తాన్ని నిర్మాతే భరించాలి. పూజాహెగ్డే కోసం వేసే ఫ్లయిట్ టికెట్, బుక్ చేసే హోటల్స్ ఈ పారితోషికానికి అదనం.
హీరోయిన్ల కెరీర్ చాలా చిన్నది. మహా అయితే ఐదేళ్లకు మించి లైమ్ లైట్లో ఉండరు. అందుకే పూజాహెగ్డే ఇలా క్రేజ్ ఉన్నప్పుడే క్యాష్ చేసుకుంటోంది. త్వరలోనే మహేష్ బాబుతో కలిసి మరోసారి సెట్స్ పైకి వెళ్లబోతోంది ఈ చిన్నది. ఈ సినిమా కోసం 5 కోట్ల పారితోషికం అందుకోబోతోందని సమాచారం.