భీష్మ సినిమాతో ఏడాది ఆరంభంలో మంచి సక్సెస్ అందుకున్నాడు హీరో నితిన్. ఇదే జోష్ లో ప్రస్తుతం రంగ్ దే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తరువాత మేర్లపాక గాంధీ దర్శకత్వం. అంధాధున్ రీమేక్‌ను ప్రారంభించాలనుకుంటున్నాడు. నితిన్ సొంత బ్యానర్‌పై ఈ సినిమా రూపొందనుంది.
అయితే ఈ చిత్రంలో పాత్ర కోసం హీరోయిన్ పూజా హెగ్డేను చిత్రబృందం తాజాగా సంప్రదించినట్టు సమాచారం. అంతే కాదు భారీ రెమ్యునరేషన్ కు ఆఫర్ చేసిందట. కానీ సినిమాకు పూజా నో చెప్పినట్టు తెలుస్తోంది. వరుస సినిమాలతో బిజీగా ఉండటం వలన డేట్స్ అడ్జెస్ట్ చేయలేనని చెప్పి పూజ ఈ సినిమాను తిరస్కరించిందట. దీంతో వేరే హీరోయిన్ కోసం చిత్రబృందం ప్రయత్నిస్తోందట.