సౌత్ మెచ్చిన హీరోయిన్ పూజా హెగ్డే. భాషతో సంబంధం లేకుండా ఆమెకు ఫ్యాన్స్ ఉన్నారు. బుట్టబొమ్మతో సెల్ఫీ దిగేందుకు అంతా ఎగబడతారు. మరి ఇలాంటి అందగత్తెకు ఎలాంటి మొగుడు రావాలి? ఈ అనుమానం పూజా హెగ్డేకు కూడా ఉంది. అందుకే చేయి చూపించుకుంది. ఎలాంటి మొగుడు వస్తాడో చెప్పమంది.
ఇది గాసిప్ కాదు, నిజంగా జరిగింది. ముంబయిలో జరిగిన ప్రచార కార్యక్రమంలో హస్తసాముద్రికం చూసే సిద్ధాంతి దగ్గర పూజా హెగ్డే తన చేయి చూపించుకుంది. ఆమె చేయి చూసిన జ్యోతిష్కుడు, పూజా హెగ్డేకు అందమైన, ఆరడుగుల అబ్బాయి భర్తగా వస్తాడని చెప్పాడు. అంతేకాదు.. పూజా హెగ్డే వైవాహిక జీవితం చాలా సుఖంగా సాగిపోతుందని కూడా జోస్యం చెప్పాడు.
రాధేశ్యామ్ సినిమాలో చేయి చూసి జాతకాలు చెప్పే విక్రమాదిత్య అనే పాత్ర పోషించాడు ప్రభాస్. అందుకే సినిమా ప్రమోషన్ లో కూడా హస్తసాముద్రికం ఎలిమెంట్ ను వాడుతున్నారు. ఇందులో భాగంగా ముంబయిలో కూడా హస్తసాముద్రికం కౌంటర్ ఏర్పాటుచేశారు.
Advertisements
ఈ కౌంటర్ వద్ద పూజా హెగ్డేతో పాటు ప్రభాస్ కూడా తన చేయి చూపించుకున్నాడు. ఇప్పటివరకు సీరియస్ గా ఎవ్వరికీ తను చేయి చూపించుకోలేదని చెప్పిన ప్రభాస్.. ఈసారి మాత్రం ప్రచారంలో భాగంగా జ్యోతిష్కుడికి తన చేయి చూపించాడు. ఆ తర్వాత తను కూడా జాతకం చెబుతానంటూ జ్యోతిష్కుడి చేయి అందుకోవడంతో, పూజా హెగ్డేతో పాటు అంతా ఒక్కసారిగా పగలబడి నవ్వారు.