పూజా హెగ్డే… ఇండస్ట్రీ లో ఉన్న నెంబర్ వన్ హీరోయిన్. ప్రస్తుతం వరుస సినిమాలతో సూపర్ డూపర్ హిట్ లను అందుకుంటూ ఫుల్ జోష్ మీద ఉంది ఈ బ్యూటీ. అయితే ఓ వైపు సినిమాలు చేస్తూనే మరో వైపు ఐటం సాంగ్స్ లో కూడా నటిస్తోంది.
ఈ నేపథ్యంలోనే సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తున్న యానిమల్ అనే సినిమాలోపూజా తో ఓ ఐటం సాంగ్ ప్లాన్ చేస్తున్నాడట దర్శకుడు సందీప్ రెడ్డి వంగా.
ఇక సినిమాలో రణ్ బీర్ కపూర్, పరిణీతి చోప్రా జంటగా నటిస్తుండగా అనిల్ కపూర్ కీలకమైన పాత్రలో నటిస్తున్నారు. అయితే ఈ సినిమాలో పూజా హెగ్డే ఐటం సాంగ్ కు గ్రీన్ సిగ్నల్ ఇస్తుందో చూడాలి.
ప్రస్తుతానికి పూజా నటించిన ఆచార్య, రాధే శ్యామ్ రిలీజ్ కు సిద్ధంగా ఉన్నాయి. ఎస్ ఎస్ ఎంబి28, బీస్ట్ షూటింగ్ దశలో ఉన్నాయి.