కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం ఆచార్య. అయితే ఈ సినిమాలో చిరు సరసన కాజల్ అగర్వాల్ నటిస్తోంది. మరోవైపు రామ్ చరణ్ కూడా నటించబోతున్నాడు. రీసెంట్ గా ఈ సినిమా షూటింగులో కూడా చరణ్ పాల్గొన్నాడు.
ఇప్పటికే రామ్ చరణ్ కు సంబంధించి ప్రీ లుక్ కూడా చిత్ర యూనిట్ రిలీజ్ చేసి ఫ్యాన్స్ లో మంచి జోష్ నింపింది. అయితే ఈ సినిమాలో చరణ్ సిద్దు గా కనిపించబోతున్నాడు. ఇదిలా ఉండగా తాజా సమాచారం ప్రకారం రామ్ చరణ్ సరసన పూజా హెగ్డే నటిస్తుందట. ఇద్దరి మధ్య ఓ సాంగ్ కూడా ఉంటుందని సమాచారం. ఇక ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే.