హీరోయిన్లంతా ఐటెంసాంగ్స్ చేస్తుంటారు. పూజా హెగ్డే కూడా ఐటెంసాంగ్ చేసింది. రంగస్థలం సినిమాలో ఆమె చేసిన ఐటెంసాంగ్ పెద్ద హిట్టయింది. అయితే ఆ తర్వాత మళ్లీ ఆమె అటువైపు చూడలేదు. దీనికి కారణం హీరోయిన్ గా బిజీ అయిపోవడమే. ఇప్పటికీ ఆమె బిజీగానే ఉంది. అయినప్పటికీ ఐటెంసాంగ్ చేయడానికి ఒప్పుకుంది
రంగస్థలం సినిమా తర్వాత పూజాహెగ్డే చేయబోయే ఐటెంసాంగ్ రెడీ అయింది. ఎఫ్3 మూవీలో ఆమె స్పెషల్ సాంగ్ చేయబోతోంది. ఆ సాంగ్ షూటింగ్ ఈరోజు నుంచి మొదలైంది. రంగస్థలంలో పూజా హెగ్డే సాంగ్ కంపోజ్ చేసిన దేవిశ్రీప్రసాద్, ఆమె చేస్తున్న ఈ రెండో ఐటెంసాంగ్ కు కూడా ట్యూన్ ఇచ్చాడు. రంగస్థలంలోని జిగేల్ రాణి టైపులోనే, ఈ సాంగ్ కూడా పెద్ద హిట్ అవుతుందంటోంది యూనిట్. పాట అంత బాగుంది కాబట్టే, పూజాహెగ్డే లాంటి స్టార్ ను తీసుకున్నారట.
ఈ సినిమా కోసం కాస్త గట్టిగానే ఛార్జ్ చేసిందట పూజాహెగ్డే. ప్రస్తుతం వినిపిస్తున్న రూమర్స్ ప్రకారం.. కోటిన్నర వరకు తీసుకున్నట్టు తెలుస్తోంది. అయినా కూడా ఎఫ్3కి క్రేజ్ తెచ్చేందుకు, ఆ ఎమౌంట్ ఇచ్చేందుకు దిల్ రాజు అంగీకరించాడట.
సూపర్ హిట్టయిన ఎఫ్2 సినిమాకు సీక్వెల్ గా వస్తోంది ఎఫ్3. వరుణ్, వెంకీ హీరోలుగా నటిస్తున్న ఈ సినిమాలో మెహ్రీన్, తమన్న హీరోయిన్లు. మరో హీరోయిన్ గా సోనాల్ చౌహాన్ ను తీసుకున్నారు. ఇప్పుడు పూజాహెగ్డే రాకతో ఈ ప్రాజెక్టుకు మరింత గ్లామర్ యాడ్ అయింది. వచ్చేనెల ఈ సినిమా థియేటర్లలోకి రాబోతోంది.