పూనకాలు లోడింగ్ అంటే ఏమిటి? దీని గురించి క్లారిటీ కావాలంటే,.. చిరంజీవి, రవితేజ కలిసి చేసిన ‘వాల్తేరు వీరయ్య’ లోని నాలుగో పాట చూడాల్సిందే.
ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూసిన మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజల ‘పూనకాలు లోడింగ్’ పాట ని విడుదల చేశారు మేకర్స్. టైటిల్ కు తగ్గట్టు పాట క్లాస్, మాస్ ప్రేక్షకులకు పూనకాలను తెప్పించింది. పూనకాలు లోడింగ్ అన్నట్లుగానే ప్రేక్షకులకు ఫుల్ జోష్ ను ఇచ్చింది. మాస్ నంబర్‌లను స్కోర్ చేయడంలో మాస్టరైన దేవి శ్రీ ప్రసాద్..అందరికీ పూనకాలు తెప్పించేలా ఈ పాటని కంపోజ్ చేశాడు.
రోల్ రిడా పూనకాలు తెప్పించే లిరిక్స్ అందించడంతో పాటు రామ్ మిర్యాలతో కలసి ఫుల్ ఎనర్జీటిక్ గా పాడాడు. అలాగే చిరంజీవి, రవితేజ తమ డైనమిక్ వాయిస్ తో ”డోంట్ స్టాప్ డ్యాన్సింగ్.. పూనకాలు లోడింగ్” అనడం ఈ పాటకు ఓ కిక్ తెచ్చింది.చిరంజీవి, రవితేజ కలిసి డ్యాన్స్ చేయడం విజువల్ ఫీస్ట్ లా ఉంది. జాతర సెటప్, భారీ జనసమూహం ఈ మాస్ నంబర్ కు అదనపు ఆకర్షణ తెచ్చిపెట్టింది. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ గ్రాండ్ గా ఉంది. చిరంజీవి మాస్ లుక్, గెటప్.. ముఠా మేస్త్రి, రౌడీ అల్లుడు లాంటి బ్లాక్‌బస్టర్స్ ని గుర్తుకుతెస్తుంది. మరోవైపు రవితేజ ట్రెండీగా కనిపిస్తున్నారు.
పాట రిలీజైన కాసేపటికే కొన్ని లక్షల వ్యూస్ ని సొంతం చేసుకుంది. సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రస్తుతం పూనకాలు లోడింగ్ సాంగ్ ట్రెండ్ గా మారింది. బాబీ దర్శకత్వం వహిస్తున్న ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ లో, చిరంజీవి సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. సంక్రాంతి కానుకగా జనవరి 13న థియేటర్లలోకి వస్తున్నాడు వీరయ్య.