రెండు బెత్తం దెబ్బలంటూ..పవన్ పై పూనమ్ కౌంటర్ - Tolivelugu

రెండు బెత్తం దెబ్బలంటూ..పవన్ పై పూనమ్ కౌంటర్

దిశ హత్య కేసు నిందితులను ఎన్కౌంటర్ చేయటంపై దేశ వ్యాప్తంగా హర్షం వ్యక్తం అవుతుంది. మరో వైపు సెలెబ్రిటీలు సైతం ఎన్కౌంటర్ చెయ్యటం పై ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అదే హత్య ఘటన జరిగిన తరువాత సోషల్ మీడియా వేదికగా టాలీవుడ్ హీరోయిన్ పూనమ్ కౌర్ కొంత భావోద్వేగానికి లోనైనా సంగతి తెలిసిందే. అయితే ఎన్కౌంటర్ జరిగిన తరువాత గుడ్ న్యూస్ విన్నాను, దిశ కు న్యాయం చేసినందుకు తెలంగాణ పోలీసులకు, తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు అంటూ ట్వీట్ చేసింది.

90ML కాదు 180ML అయినా ఎక్కదు-90MLరివ్యూ

అలాగే కొంత మంది నాలాంటి మహిళలను మోసం చేసిన సినీ అలియాస్ రాజకీయ నాయకులను కూడా శిక్షిస్తారని కోరుకుంటున్నానంటూ ట్వీట్ చేసి ఆఖరిలో రెండు బెత్తం దెబ్బలంటూ రాసుకొచ్చింది. ట్వీట్ చేసిన కాసేపటికే మళ్ళీ ట్వీట్ డిలీట్ చేసింది.

విక్టరీ వెంకటేష్‌ వారసుల ఎంట్రికి ముహుర్తం ఫిక్స్

పూనమ్ పరోక్షంగా పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేసినట్టు అయితే కనిపిస్తుంది. ఇటీవల దిశ హత్య కేసు పై స్పందించారు పవన్ కళ్యాణ్. అత్యాచారం చెయ్యాలనే ఆలోచన రాకుండా ముందే రెండు బెత్తం దెబ్బలు కొట్టి ఉంటె ఈ పరిస్థితులు వచ్చేవి కాదని చెప్పిన సంగతి తెలిసిందే. పవన్ ని టార్గెట్ చేసి ట్వీట్ చేసిన పూనమ్ వెంటనే ఎందుకు డిలీట్ చేసిందనేది మాత్రం అర్థంకాక నెటిజన్లు తలలు పట్టుకుంటున్నారు.

Share on facebook
Share on twitter
Share on whatsapp