పూనమ్ కౌర్… ఈ పేరు పెద్దగా చెప్పనవసరం లేదు. తెలుగులో చాలా సినిమాలు చేసినప్పటికీ ఈ అమ్మడు అంతగా గుర్తింపు తెచుకోలేకపోయింది. అయితే ప్రస్తుతం సినిమాలు లేక ఖాళీగా ఉంటున్న ఈ అమ్మడు సోషల్ మీడియా లో యాక్టీవ్ గా ఉంటుంది. గతం పూనమ్ చేసిన ట్వీట్లు, కామెంట్స్ ఎన్నో వివాదాలకు దారితీసాయి. పవన్‌కల్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ `జల్సా` సినిమా విషయంలో ఆమె పేరు ఎక్కువగా వినిపించింది.
ఇప్పటివరకు పెద్దగా రియాక్ట్ కాని పూనమ్ తాజాగా ఆ సినిమా గురించి స్పందించింది. దాసరి జన్మదినోత్సవం సందర్భంగా చేసిన ట్వీట్‌లో `జల్సా` గురించి ప్రస్తావించింది. ఎన్నికల సమయంలో నా గురించి అనేక పుకార్లు వినిపించాయి. జల్సా చిత్రంలో అవకాశం దక్కలేదనే కారణంతో నేను వేదనకు గురైనట్టు ప్రచారం జరిగింది. అవన్నీ తప్పుడు వార్తలు. ఒక్క దాసరి గారి దర్శకత్వంలో తప్ప మరే దర్శకుడితోనూ పనిచేయాలని నేను కలలు కనలేదని పూనమ్ ట్వీట్ చేసింది.