బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ షో కు ఎంత ఆదరణ ఉందొ కొత్తగా చెప్పనవసరం లేదు. ఇప్పటికే మూడు సీజన్లను ముగించుకున్న బిగ్ బాస్ ఇప్పుడు నాల్గవ సీజన్ కు సిద్ధం అవుతుంది. మొదటి సీజన్ కు ఎన్టీఆర్ హోస్ట్ గా చేయగా తరువాత, నాగార్జున చేశారు. ఇప్పుడు నాల్గవ సీజన్ కు కూడా నాగార్జుననే హోస్ట్ గా సెలెక్ట్ చేశారు. ఇక కంటెస్టెంట్ ల విషయానికి వస్తే ఓ లిస్ట్ సోషల్ మీడియాలో ప్రచారం అవుతుంది.
అయితే సీజన్ 4 కి గాను షో నిర్వాహకులు టాలీవుడ్ కాంట్రవర్సీ హీరోయిన్ పూనమ్ కౌర్ ను సంప్రదించారట. అయితే చాలా సినిమాలో హీరోయిన్ గా నటించిన పూనమ్ వాటికంటే కాంట్రవర్సీల ద్వారానే ఎక్కువగా గుర్తింపు సంపాదించుకుంది. అందువల్ల ఇటువంటి భామ తమ షోలో ఉంటె బాగుంటుంది అనుకున్నారట నిర్వాహకులు. అయితే ఈ ఆఫర్ కు పూనమ్ మాత్రం నో చెప్పినట్లు తెలుస్తుంది.