లైంగిక వేధింపులు, గృహ హింసకు సంబంధించి మహిళలకు చట్టాలతో రక్షణ కల్పించొచ్చు. అయితే అవే చట్టాల్ని కొంతమంది దుర్వినియోగం చేస్తున్న సందర్భాలు కూడా ఉన్నాయి. హీరోయిన్ పూనమ్ పాండే కూడా చట్టాల్ని దుర్వినియోగం చేస్తోందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ఆరోపణలు చేస్తోంది ఎవరో కాదు, స్వయంగా పూనమ్ పాండే భర్త శామ్ బాంబే.
పెళ్లి తర్వాత భార్యాభర్త హనీమూన్ కు వెళ్లడం సహజం. పూనమ్-శామ్ కూడా అలానే గోవా వెళ్లారు. కానీ 2 రోజులకే పూనమ్ గోవా పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన భర్త తనను వేధిస్తున్నాడంటూ కంప్లయింట్ ఇచ్చింది. దీంతో శామ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. హనీమూన్ కు వెళ్లిన తర్వాత సెక్స్ చేయడం అత్యంత సహజమైన ప్రక్రియ అని, దాన్ని కూడా పూనమ్ రేప్ కింద చూడడం తనను బాగా కలిచివేసిందని చెప్పుకొచ్చాడు శామ్. అలా 20 సార్లు పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కి, దిగానని బాధపడ్డాడు. ఇంత జరిగినా తను క్లీన్ చిట్ తో బయటపడ్డానని, దానికి తన నిజాయితీనే కారణం అన్నాడు.
నిజానికి ఈ ఘటన జరిగి చాన్నాళ్లయింది. మళ్లీ ఇప్పుడు మరోసారి ఆ ఘటనపై శామ్ స్పందించడానికి ఓ కారణం ఉంది. రీసెంట్ గా కంగనా రనౌత్ హోస్ట్ చేస్తున్న ఓ కార్యక్రమానికి పూనమ్ ప్రత్యేక అతిథిగా హాజరైంది. ఆ షోలో మరోసారి అప్పటి ఘటనను గుర్తు చేసుకుంది. తన భర్త తనను బాగానే ప్రేమించాడని, కానీ తనకు కూడా ఏకాంతం అవసరమనే విషయాన్ని శామ్ గుర్తించలేదని ఆరోపించింది.
Advertisements
తనను శామ్ ఏకాంతంగా ఉండనిచ్చేవాడు కాదని, తనతో ఉండమని బలవంతం చేసేవాడని చెప్పుకొచ్చింది. కొన్నిసార్లు ఫోన్ కూడా తీయనిచ్చేవాడు కాదని, ఏదైనా మాట్లాడితే తిట్టడం-కొట్టడం చేసేవాడని ఆరోపించింది. అందుకే హనీమూన్ టైమ్ లోనే కేసు పెట్టాల్సి వచ్చిందని తెలిపింది. పూనమ్ ఇలా ఆరోపణలు చేయడంతో శామ్ బాంబే మరోసారి తెరపైకొచ్చాడు. పూనమ్ కు ప్రచార పిచ్చి ఎక్కువని, అందుకే తనను బద్నామ్ చేస్తోందని ప్రత్యారోపణ చేశాడు.