సామాజిక అంశాలపై సెలబ్రిటీలు స్పదించడం తరుచూ జరిగేదే..అయితే ఇష్యూ గురించి పూర్తిగా తెలుసుకోకుండా స్పందిస్తే బదులుగా కామెంట్స్, ట్రోల్స్ ఎదుర్కొవాల్సి వస్తుంది.అరకొర అవగాహన ఎప్పుడూ ప్రమాదమేగా! అందుచేత ఇలాంటి పరిస్థితుల్లో నిజమైన బాధితులు స్పందించిన సెలబ్రిటీలే అవ్వాల్సి వస్తుంది.ప్రముఖ సినీనటి పూనమ్ కౌర్ పరిస్థితి అలాగే అయ్యింది.ఇక విషయాని వస్తే… వైద్య విద్యార్థిని ప్రీతి ఆత్మహత్యాయత్నం కేస్ ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది.
ఇప్పటికే దీనిపై చాలా మంది ప్రముఖులు, రాజకీయ వేత్తలు, నెటిజన్లు స్పందిస్తున్నారు. కొన్ని చోట్ల ప్రీతికి న్యాయం జరగాలంటూ ధర్నాలు కూడా నిర్వహించారు.
అయితే ప్రీతిపై సైఫ్ అనే వ్యక్తి వేధింపులకు పాల్పడినట్లు పోలీసుల విచారణలో తేలింది. అతడికి 14 రోజులు రిమాండ్ విధించారు. ఇదిలా ఉంటే ఈ దారుణ ఘటనలో ప్రీతి ఇంకా ప్రాణాలతో పోరాడుతుంది. కానీ, నటి పూనమ్ కౌర్ మాత్రం ప్రీతి చనిపోయినట్లు ఓ ట్వీట్ షేర్ చేసింది. దీంతో ఆమెపై నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు.
పూనమ్ ట్వీట్‌లో.. ‘‘మనుగడ, పరువు, న్యాయం మధ్య మరో అమ్మాయి ప్రాణం తీసింది. వైద్య కళాశాలలో ప్రవేశించడానికి చాలా కష్టపడి పనిచేసిన తరువాత, ఆమె తన కలలను వదులుకోవాల్సి వచ్చింది. ఆమె తల్లిదండ్రులు దీని నుండి ఎప్పటికీ కోలుకోలేరు.ఏ శిక్ష అయిన నొప్పికి సరిపోదు లేదా న్యాయం పొందదు’’ అంటూ ట్వీట్ చేసింది.
దీంతో ఈ ట్వీట్ కాస్త వైరల్ అవుతుంటే.. ‘‘న్యూస్ పూర్తిగా తెలుసుకుని ట్వీట్ వేయాలి లేకపోతే అడ్డంగా బ్లేమ్ అవుతారు.. ఆమె ఇంకా ప్రాణాలుతోనే ఉంది’’ అంటూ నెటిజన్లు పూనమ్‌పై ఫైర్ అవుతున్నారు.
మనుగడ , పరువు , న్యాయం మధ్య మరో అమ్మాయి ప్రాణం తీసింది . వైద్య కళాశాలలో ప్రవేశించడానికి చాలా కష్టపడి పనిచేసిన తరువాత, ఆమె తన కలలను వదులుకోవలసి వచ్చింది మరియు ఆమె తల్లిదండ్రులు దీని నుండి ఎప్పటికీ కోలుకోలేరు. ఏ శిక్ష అయినా నొప్పికి సరిపోదు లేదా న్యాయం పొందదు.#warangal #docsaif
— पूनम कौर ❤️ poonam kaur (@poonamkaurlal) February 24, 2023