కరీంనగర్ : కళ్ల ముందు కన్నబిడ్డ శవంలా ఆసుపత్రిలో పడివుంది. వైద్యమే చేయించలేని ఆ పేద తండ్రి కూతురి మృతదేహాన్ని చూసి మౌనంగా ఏడుస్తున్నాడు. ఆసుపత్రి సిబ్బంది ఆ మృతదేహాన్ని స్ట్రెచర్‌పై తీసుకొచ్చి అక్కడే మెయిన్ ఎంట్రెన్స్ మెట్ల దగ్గర వదిలేసి వెళ్లిపోయారు. బిడ్డ శవాన్ని ఇంటికి తీసుకెళ్దామంటే చేతిలో చిల్లి గవ్వలేదు. అంబులెన్స్ కోసం ఆసుపత్రి అధికారులను బతిమాలితే ‘అవి పనిచేస్తలేదు.. పో’ అన్నారు. కంటికి ధారగా ఏడుస్తూ ఆ నిర్భాగ్యుడు అలానే ఆ పిల్ల మృతదేహాన్ని చేతుల్లోకి తీసుకుని మోసుకుంటూ దవాఖానా నుంచి ఆటో స్టాండ్ వరకు తీసుకెళ్లాడు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాం పూర్ మండలం కూనారం గ్రామానికి చెందిన ఆ పేద తండ్రి సంపత్ చివరికి ఎలాగోలా అక్కడున్న ఆటో డ్రైవర్లను కాళ్లావేళ్లా పడి బతిమాలుకొని తన కూతురు కోమలత మృతదేహాన్నిఇంటికి తీసుకెళ్లాడు. కరీంనగర్ జిల్లా ఆసుపత్రి దగ్గర జరిగిన ఈ సంఘటన మన ధర్మాసుపత్రుల పనితీరును బట్టబయలు చేస్తోంది. తెలంగాణ పల్లెల్లో దాదాపు ప్రతిచోటా ఇదే పరిస్థితి. అంబులెన్సులు అవసరానికి వుండవు. అధికారుల్ని, ఆసుపత్రి సిబ్బందిని అడిగితే కసురుకుంటారు.
Tolivelugu Latest Telugu Breaking News » Top Stories » ఈ దారుణమేంది దొరా?