అవికా గోర్ సెలక్ట్ చేసుకునే సినిమాలు, అందులో పాత్రలు కొత్తగా ఉంటాయి. ఈసారి కూడా ఈ పిల్ల అదే పని చేసింది. పాప్ కార్న్ అనే మూవీ చేసింది. తాజాగా ఆ సినిమా ట్రయిలర్ రిలీజైంది. ట్రయిలర్ చూస్తే, అవికా సెలక్షన్ ఏంటనేది ఈజీగా అర్థమౌతుంది.
నాగార్జున చేతుల మీదుగా విడుదలైన పాప్ కార్న్ మూవీ ట్రయిలర్ చాలా కొత్తగా ఉంది. హీరోయిన్ షాపింగ్ కు వెళ్తుంది. లిఫ్ట్ లో ఇరుక్కుంటుంది. అదే లిఫ్ట్ లో హీరో కూడా ఇరుక్కుపోతాడు. ఇద్దరికీ ఒకరికి ఒకరు పరిచయం ఉండదు. ఇది ఇంతకుముందు కొన్ని సినిమాల్లో చూసేశాం.
ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. అదే హోటల్ లో బాంబ్ బ్లాస్ట్ జరుగుతుంది. ఆ బ్లాస్ట్ నుంచి వీళ్లిద్దరూ ఎలా తప్పించుకున్నారనే విషయాన్ని కొత్తగా చూపించే ప్రయత్నం చేశాడు దర్శకుడు.
సాయిరోణక్, అవికా హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు మురళి గంధం దర్శకత్వం వహించాడు. స్క్రీన్ ప్లే, డైలాగ్స్ కూడా ఇతడివే. శ్రవణ్ భరధ్వాజ్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీని ప్రకటిస్తారు.