ప్రపంచ క్రైస్తవులు దైవ సమానులుగా భావించే వాటికన్ పోప్ ఓ మహిళకు స్వయంగా సారీ చెప్పారు. వాటికన్ సిటీలో నూతన సంవత్సరం వేడుకల సందర్భంగా సెయింట్ పీటర్స్ స్క్వేర్ దగ్గర గుమి గూడిన వేలాది భక్తులను పోప్ ఫ్రాన్సిస్ శుభాకాంక్షలు చెప్పుకుంటూ వెళ్తున్నారు. ఆ గుంపులో నుంచి ఓ మహిళ ఏడ్చుకుంటూ పోప్ కు ఏదో చెప్పాలని ప్రయత్నించింది. అది ఆయన గమనించ లేదు. ఇంతలో ఆమె సడెన్ గా పోప్ కు ఎదురుగా వచ్చి ఆయన చేయి పట్టుకొని లాగింది. పోప్ పడిపోయినంత పనైంది. దీంతో అసహనానికి గురైన పోప్ ఆ మహిళ నుంచి తన చెయ్యిని వెనక్కి లాక్కునేందుకు ఆమె చెయ్యిపై ఓ దెబ్బ వేశారు. ఇంతలోనే సెక్యూర్టీ వాళ్లు వచ్చారు. ఈ వీడియో కొన్ని గంటల్లోనే సోషల్ మీడియాలో వైరలయ్యింది.
అనంతరం మహిళలపై హింస అనే అంశంపై ప్రసంగించే ముందు ఆ మహిళకు పోప్ స్వయంగా సారీ చెప్పారు.” మనం కొన్ని సార్లు సహనం కోల్పోతాం” అని తప్పును అంగీకరించారు. ” అది నాకు కూడా జరిగింది..ఆ సంఘటనకు నేను క్షమాపణ చెబుతున్నాను” అని అన్నారు.
సోషల్ మీడియాలో వైరలైన ఈ వీడియోపై రకరకాల అభిప్రాయలు వ్యక్తమవుతున్నాయి. కొందరు మహిళను తప్పుబడుతుండగా…మరికొందరు పోప్ ఫ్రాన్సిస్ ను తప్పు బడుతున్నారు.