మన దేశంలో సినిమా హీరోలకు ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. సౌత్ అయినా నార్త్ అయినా సరే సినిమాలు హిట్ అయితే, స్టార్ ఇమేజ్ వస్తే వాళ్ళు రాజకీయాల్లోకి రావాల్సిందే, ప్రజా సేవ చేయాల్సిందే అనే మాట వింటాం. అలా ప్రజల కోసం వచ్చిన వాళ్ళు కొందరు సంపాదన కోసం రాజకీయాల్లోకి వచ్చిన కొందరు. ఏది ఎలా ఉన్నా సరే రాజకీయాల్లోకి వచ్చిన హీరోలను ఒకసారి చూద్దాం.
Also Read:మెగాస్టార్ మార్చేసిన సుకుమార్… లుక్ సూపర్
ఎన్టీఆర్
మన తెలుగు రాష్ట్రాల్లో ఆయన్ను దేవుడిగా చూసే వాళ్ళు ఉన్నారు. దశాబ్దాల పాటు సినీ ప్రపంచంలో ఒక వెలుగు వెలిగిన ఎన్టీఆర్… తర్వాత పార్టీ పెట్టి సిఎం అయ్యారు. ఏడేళ్ల పాటు సిఎం గా కొనసాగారు.
ఎంజీ రామచంద్రన్
తమిళనాట ఆయన్ను అన్నగారిగా కీర్తిస్తూ ఉంటారు. ఆయన కూడా రాజకీయాల్లోకి వచ్చి అన్నాడిఎంకే పార్టీని స్థాపించారు. సిఎం గా ప్రజలకు సేవలు అందించారు.
జయలలిత
అన్నాడిఎంకే పార్టీ ద్వారా 15 ఏళ్ళ పాటు ఆమె సిఎం గా సేవలు అందించారు. అనారోగ్యం కారణంగా జయలలిత ప్రాణాలు విడిచారు.
శివాజీ గణేషన్
డిఎంకె, కాంగ్రెస్ పార్టీలలో రాజ్యసభ సభ్యుడిగా పని చేసారు. ప్రజల్లో ఆయనకు మంచి ఆదరణ ఉన్నా సరే రాజకీయాల్లో రాణించలేదు.
సూపర్ స్టార్ కృష్ణ
కాంగ్రెస్ పార్టీ నుంచి ఏలూరు ఎంపీగా ఆయన చేసారు. ప్రజల్లో ఆయనకు ఆదరణ ఉన్నా సరే వ్యక్తిగత కారణాలతో రాజకీయాలకు దూరంగా ఉన్నారు.
చిరంజీవి
మన తెలుగులో ఎన్టీఆర్ తో ప్రజలు ఆ రేంజ్ లో ఆదరించిన హీరో చిరంజీవి. ప్రజారాజ్యం పార్టీ స్థాపించారు. ఆ తర్వాత కాంగ్రెస్ లో విలీనం చేసి కేంద్ర మంత్రిగా సేవలు అందించారు.
కమల్ హాసన్
రాజకీయ పార్టీ ని స్థాపించి ఎన్నికల్లో ఆయన కంగు తిన్నారు. అయినా సరే రాజకీయాల్లోనే ఆయన కొనసాగుతున్నారు.
పవన్ కళ్యాణ్
రాజకీయాల్లో ఆయనకు ఇమేజ్ తక్కువే అయినా సినిమా స్టార్ గా మంచి ఇమేజ్ ఉంది. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించి ఆ పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నారు.
నందమూరి హరికృష్ణ
ఎన్టీఆర్ తనయుడిగా రాజకీయాల్లోకి వచ్చిన ఆయన… తండ్రి వెంట ఉంటూ అన్ని విధాలుగా సహకరించారు. అయితే ఎన్టీఆర్ మరణం తర్వాత చంద్రబాబుకి దూరం జరిగినా… మళ్ళీ తర్వాత చంద్రబాబుకి దగ్గరయ్యారు.
నందమూరి బాలకృష్ణ
2014 లో అసెంబ్లీ ఎన్నికల్లో హిందూపురం నియోజకవర్గం నుంచి పోటీ చేసారు. వరుసగా రెండు సార్లు ఎమ్మెల్యే గా గెలిచారు బాలయ్య. తండ్రి, బావ చంద్రబాబు రాజకీయాల్లో ఉన్నా సరే ఆయన 2014 లోనే రాజకీయాల్లోకి వచ్చారు.
విజయశాంతి
లేడీ అమితాబ్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న విజయశాంతి… రాజకీయాల్లో మాత్రం సరిగా నిలబడలేదు. సొంత రాజకీయ పార్టీ స్థాపించి ఆ తర్వాత తెరాస లో అడుగు పెట్టి… కాంగ్రెస్, బిజెపి లో జాయిన్ అయ్యారు.
కెప్టెన్ విజయ్ కాంత్
రాజకీయాల్లో అడుగు పెట్టి బాగా దెబ్బ తిన్న వారిలో ఈయన ముందు వరుసలో ఉంటారు. తమిళనాట అసలు ఈయన ప్రభావం ఎంత మాత్రం కూడా లేదనే చెప్పాలి.
శరత్ కుమార్
తమిళనాట మంచి స్టార్ హీరో ఇమేజ్ వచ్చినా సరే ఆయన మాత్రం రాజకీయాల్లో అనుకున్నది సాధించలేదు. దీనితో రాజకీయాల నుంచి బయటకు వెళ్లి సినిమాల మీదనే ఫోకస్ చేసారు.
Also Read:సారు చెప్పేదొకటి.. చేసేదొకటి! జాతీయ నేతలు నమ్ముతారా?