నీ డబ్బులు నీకిచ్చేస్తా.. ఇక నీతో కటీఫ్

అమెరికా అధ్యక్షుడు ట్రంప్…ఆయన ఒకప్పుడు పోర్న్ స్టార్ స్టెఫానీ క్లిఫర్డ్ తో సాగించిన రాసలీలల యవ్వారం మళ్ళీ పతాక శీర్షికలకెక్కింది. ట్రంప్ అధ్యక్షుడు కాక ముందు..అంటే..2006 లో స్టెఫానీతో సాగించిన వ్యవహారం పెద్ద ఎత్తున దుమారం రేపింది. అది కొన్ని నెలల పాటు కొనసాగగా.. మళ్ళీ ట్రంప్ వ్యతిరేకులు దీన్ని రచ్చ చేయడంతో అమెరికాలో ఇదో హాట్ టాపిక్ గా మారింది. స్టెఫానీ కి (ఈమెనే స్టార్మీ డేనియల్ అని కూడా అంటారట) ట్రంప్ తరఫున తనే లక్షా 30 వేల డాలర్లు తన జేబు నుంచి చెల్లించానని. ఇక ఆమె నోరు మూసుకుంటే మంచిదని ట్రంప్ లాయర్ మైఖేల్ కోహెన్ ఆమధ్య ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఆయితే ఇప్పుడిది కొత్త మలుపు తిరిగింది. ఆ డబ్బు తిరిగి ఇచ్చేస్తానని. ఇక మన మధ్య మాటల్లేవని స్టెఫానీ ప్రకటించింది. మీ క్లయింటుకు ఇదే విషయాన్ని చెప్పు అంటూ ఆమె తరఫున ఆమె న్యాయవాది మైఖేల్ అవనెట్టి..కోహెన్ కు రాసిన ఓ లేఖలో పేర్కొన్నారు. శుక్రవారం కల్లా ఈ సొమ్ము ట్రంప్ అకౌంట్లో జమ అవుతుందని..మంగళవారం నాటికి మీ స్పందన తెలియజేయాలని అందులో కోరారు. దీనివల్ల ఎవరు నిజం చెబుతున్నారో. ఎవరు అబద్ధాలాడుతున్నారో అమెరికన్లకు తెలిసిపోతుందని స్టెఫానీ పేర్కొంది. మొత్తానికి ట్రంప్ అధ్యక్షుడైనా.. ఇది మాసిపోని మరకలాగే ఆయనకు చుట్టుకుంది.