ఏపీ సీఎం వైఎస్ జగన్ అంటే అంతులేని అభిమానమని వైసీపీ నేత, నటుడు పోసాని కృష్ణ మురళి వ్యాఖ్యానించారు. ఓ ఇంటర్వ్యూలో పోసాని మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. తనలాంటి వ్యక్తి ఒకరు కేబినెట్ లో ఉండాలని, మూడు సార్లు జగన్ తనకు అవకాశం ఇచ్చారని.. కానీ అందుకు తాను అంగీకరించలేదని స్పష్టం చేశారు. ఓ వ్యకిని ప్రతినిధిగా కూడా పంపించారని అయినప్పటికీ తన నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదని చెప్పినట్లు తెలిపారు. పదవులపై ఎలాంటి ఆసక్తి లేదని చెప్పారు. నా జీవిత కాలంలో జగన్ తనతో ప్రేమగా మాట్లాడితే అదే చాలునన్నారు.
ఇక గతంలో ప్రజారాజ్యం పార్టీ తరుపున కూడా చిరంజీవి ఒత్తిడి మేరకు పోటీ చేశానని అన్నారు. తనకు టికెట్ ఇవ్వాలని తాను చిరంజీవిని అడగలేదని చెప్పారు.