జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. లేటెస్ట్ గా ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో ‘గ్లోబల్ స్టార్’ గా గుర్తింపు తెచ్చుకున్నాడు ఎన్టీఆర్. సినిమాల గురించి పక్కన పెడితే.. రాజకీయాల్లోనూ ఎన్టీఆర్ పేరు తరచూ వినిపిస్తూంటుంది. సీనియర్ ఎన్టీఆర్ లా అటు సినిమాలను, ఇటు రాజకీయాలను దున్నేసే కెపాసిటీ జూనియర్ ఎన్టీఆర్ కి ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇటీవల టీడీపీ నేత నారా లోకేష్ కూడా పాలిటిక్స్ లో జూనియర్ ఎన్టీఆర్ ఎంట్రీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అయితే తారక్ మాత్రం రాజకీయాలకు ఇంకా చాలా సమయం ఉందంటున్నాడు.
ఈ క్రమంలోనే ఏపీ ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పోసాని కృష్ణ మురళి.. జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీపై పలు కీలక వ్యాఖ్యలు చేశారు. అచ్చం సీనియర్ ఎన్టీఆర్ లాగానే ఉండే జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తే కొత్త మార్పుకు శ్రీకారం చుడతాడని, ఆయనతో ఎన్నో మార్పులు చోటుచేసుకుంటాయన్నారు.
జూనియర్ ఎన్టీఆర్ తో చంద్రబాబుకు చాలా అవసరం ఉందన్నారు. ఎన్టీఆర్ వాంటెడ్ పర్సన్ అని పేర్కొన్నారు. అందుకే ఎన్టీఆర్ ని ఎవరూ ఎలాంటి విమర్శలు చేయడం లేదన్నారు. అతనితో మంచిగా ఉంటే ఫ్యాన్స్ ఓటన్లీ తమ పార్టీకే పడతాయని ఆలోచిస్తున్నారని చెప్పారు పోసాని.
ఒకవేళ రాజకీయాల్లోకి వస్తే.. ముఖ్యమంత్రి అయ్యే కెపాసిటీ ఉన్నది కేవలం ఎన్టీఆర్ కు మాత్రమేనని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు పోసాని కృష్ణ మురళి. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి.