వైసీపీ బూతుల వ్యవహారంలో అధినాయకత్వం సూచనలున్నాయా…? పృథ్వీ వ్యాఖ్యలపై పోసాని మాటలు అంతా జగన్మాయేనా…? మంత్రుల బుతు పురాణంలో మాట్లాడని నేతలు పృథ్వీపైనే ఎందుకు విమర్శలు ఎక్కుపెట్టారు…? బుతు పురాణం వెనుక సీఎం జగన్ స్క్రిప్ట్ ఉందా…?
కొంతకాలంగా వైసీపీ నేతల విమర్శలు హద్దులు దాటుతున్నాయన్న సంగతి అందరికీ తెలిసిందే. ముఖ్యంగా మంత్రుల మాటలపై ప్రజల్లో ఎంతో వ్యతిరేకత వచ్చింది. అయితే అవి పొలిటికల్ విమర్శలు కావటంతో అంతా విని వదిలేశారు. కానీ రాజధాని వ్యవహరంలో మొదట్లో మాట్లాడని సినీ నటుడు పృథ్వీ ఒక్కసారిగా రైతులపై రెచ్చిపోయాడు. రైతులంటే పోలాల్లో ఉండాలి, దొరికింది తినాలి, షర్టు ప్యాంటు వేసుకుంటారా అంటూ కామెంట్ చేశాడు.
పృథ్వీ చేసిన కామెంట్ ఒక్క రాజధాని రైతుల్లో మాత్రమే కాదు రాష్ట్రవ్యాప్తంగా ఎదురుదాడి ప్రారంభమైంది. రైతులకు వైసీపీ ఇచ్చే గౌరవం ఇదేనా, సీఎం జగన్ దీనిపై ఎం చెబుతారు, రైతులంటే అంత అలుసా అంటై మండిపడుతున్నారు. దాంతో వెంటనే పోసాని సీన్‌లోకి ఎంటరై… పృథ్వీ క్షమాపణ చెప్పాలని, రైతులు షర్టు-ప్యాంటు వేసుకోవద్దా అంటూ మండిపడ్డారు. అయితే పోసాని మాట్లాడిన తీరు చూస్తేంటే వైసీపీ ఇమేజ్ డ్యామెజ్ కంట్రోల్ చేపట్టినట్లు స్పష్టంగా కనపడుతోంది. దీనిపై మరింత దుమారం చెలరేగకముందే పోసానిని రంగంలోకి దించారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పృథ్వీ సినిమా రంగం వ్యక్తి కావటంతో అదే కోవకు చెందిన పోసానితో విమర్శలు చేయించారని, మంత్రులు పొలిటికల్ అంశంలో బూతులతో చేసిన ఎదురుదాడి వర్కవుటయినట్లే ఇక్కడా అవుతుందని వైసీపీ భ్రమపడిందని అంటున్నారు. అయితే మంత్రులు బూతులు మాట్లాడిన, రైతులపై సినిమా నటులు బాధ్యత లేకుండా మాట్లాడిన అంతా జగన్ స్క్రిప్ట్‌లో భాగమేనని, ఎదురుదాడే అసలు సూత్రమని స్పష్టం చేస్తున్నారు.