ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సినిమాలు అంటే ఒక రేంజ్ లో క్రేజ్ ఉంటుంది జనాల్లో. ఆయన ఏ సినిమా చేసినా సరే వాటి గురించి ఎక్కువగా చర్చ జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు వివాదాస్పద చిత్రాలు ఎక్కువగా చేస్తూ ఆయన బిజీగా ఉన్నారు. సోషల్ మీడియాలో రాజకీయ అంశాల గురించి పోస్ట్ లు పెడుతూ వివాదాలతో సావాసం చేస్తున్నారు. అలాంటి వర్మకు ఒకప్పుడు సినిమా పరిశ్రమలో మంచి క్రేజ్ ఉండేది.
ఆయనతో సినిమాలు చేసేందుకు లేదా పని చేసేందుకు చాలా మంది ఎదురు చూసిన సందర్భాలు ఉండేవి. శివ సినిమా తర్వాత దర్శకులకు ఆయన ఒక రోల్ మోడల్ అయిపోయారు. ఇప్పుడు స్టార్ దర్శకులుగా ఉన్న కొందరు ఆయన దగ్గర ఓనమాలు నేర్చుకున్న వారే. పూరి జగన్నాథ్, కృష్ణ వంశీ వంటి వాళ్లకు ఆయన దర్శకత్వ పాఠాలు చెప్పారు అప్పట్లో. కాని వర్మ క్రేజ్ ఇప్పుడు పడిపోయింది.
ఇదిలా ఉంచితే వర్మ… శివ సినిమా తర్వాత పోసాని కృష్ణ మురళి గురించి తెలుసుకున్నారు. ఆయన అప్పుడు పరుచూరి బ్రదర్స్ దగ్గర పని చేస్తున్నారు. క్షణ క్షణం సినిమాకు డైలాగులు రాయాలని అడిగారట. కాని పోసాని మాత్రం తాను పీహెచ్ డీ చేస్తున్నాను అని అయ్యే వరకు ఎవరి దగ్గరా పని చేసే అవకాశమే లేదన్నారట. ఆ తర్వాత గాయం సినిమాలో ఇద్దరూ కలిసి పని చేసారు.