ఎన్టీఆర్ యూనివర్సిటీ ఉద్యోగస్తులు చేస్తున్న నిరసన దీక్షకు మద్దతు పలికారు జనసేన నేత పోతిన వెంకట మహేష్. రాబోయే రోజుల్లో ఉద్యోగస్తుల జీతాలు, పెన్షన్ మెయింటెనెన్స్ ఖర్చులకు రాష్ట్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించక తప్పదన్నారు.
యూనివర్సిటీ నిధులు 440 కోట్ల రూపాయలు స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ కు బదలాయించడం కరెక్ట్ కాదని మండిపడ్డారు మహేష్. అడిగిన నిధులు కంటే ఎక్కువగా నిధులు మళ్లించిన వైస్ ఛాన్సలర్ శ్యామ్ సుందర్ ముఖర్జీ ఏం ఆశించి ఈ పని చేశారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. జాతీయ బ్యాంకుల్లో డబ్బులు డిపాజిట్ చేస్తే భద్రత ఉంటుంది.. వడ్డీ స్థిరంగా వస్తుందన్న ఆయన.. దొంగ దగ్గర ఎవరూ డబ్బులు దాచుకోరని విమర్శలు చేశారు.