విస్తృతంగా వర్షాలు కురుస్తున్నాయి. మరోవైపు ఎప్పుడూ లేని విధంగా డ్యాముల్లో నీళ్లు నిండు కుండలా వున్నాయి. ఐనా, కూడా ఆంధ్రప్రదేశ్‌లో అంథకారం తాండవిస్తోంది.
విజయవాడ: పవన విద్యుత్ ఉత్పత్తి ఆగిపోవడంతో తూర్పు ప్రాంత విద్యుత్ సంస్థ పరిధిలోని 5 జిల్లాలో విద్యుత్ కోతలు మొదలయ్యాయి. గత 5 రోజులుగా సాయంత్రం 6 గంటలు నుంచి 11 గంటల మధ్య రోజూ గంట పాటు సరఫరా నిలిపివేస్తున్నారు. శనివారం మాత్రం ఏకంగా 2 గంటలు నుంచి 5 గంటల వరకూ కోతలు విధించారు. ఈ ఎఫెక్ట్ మరో 10 రోజులు ఉండే అవకాశం ఉంది.
శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయ గోదావరి జిల్లాల్లో విడతల వారిగా ఫీడరులకు అమలు చేస్తారు. ప్రస్తుతం పవన విద్యుత్ ఉత్పత్తి పడిపోవడంతో ఈ సమస్య వచ్చింది. సెంట్రల్ గ్రిడ్ నుంచి నిర్ణీత కెటాయింపు కన్నా ఎక్కువగా విద్యుత్‌ను వాడటం వల్లే ఈ సమస్యలు వస్తున్నాయని అధికారులు చెబుతున్నారు. ఈపీడీసీఎల్ పరిధిలో నిన్నటికి 750 మెగావాట్ల విద్యుత్ కొరత నమోదైంది. మరోవైపు విశాఖ జిల్లాలో రోజుకు 23 మిలియన్ యూనిట్ల అవసరం అవుతుంది. అక్కడ దాదాపుగా 15 మిలియన్ యూనిట్స్ మాత్రమే ఉంటుంది .మరోవైపు వర్షాల వల్ల బొగ్గు కూడా రావటం లేదని, కొత్తగా ప్రభుత్వం ప్రవేటు సంస్థలు నుంచి కొనుగోలు కూడా ఆపివేయటంతో ఈ సమస్యలు వచ్చాయని అంటున్నారు. కృష్ణ పట్నం విద్యుత్ నుండి విద్యుత్ ఉత్పత్తి చేసే వరకు ఈ ఇబ్బందులు తప్పవు అంటున్నారు అధికారులు.