పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పవన్ కళ్యాణ్ కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ అయితే అంతా ఇంతా కాదు. విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు… లాంగ్ గ్యాప్ తర్వాత వరుస సినిమాలను చేస్తున్నాడు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగైదు సినిమాలను లైన్ లో పెట్టాడు. అయితే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరిలోనూ ఇప్పుడు ఓ ప్రశ్న మెదులుతోంది. అది ఏంటంటే… ఇటీవల కాలంలో పవన్ కళ్యాణ్ పోస్టర్ లలో గాని, ప్రమోషన్ లో గాని ఎక్కడ కూడా పవర్ స్టార్ అనేది కనిపించట్లేదు. ఓన్లీ పవన్ కళ్యాణ్ అని మాత్రమే కనిపిస్తోంది.
అయితే పవర్ స్టార్ పేరును కావాలనే తొలగించా… ఇంకేమైనా కారణాలు ఉన్నాయా అనేది మాత్రం ఎవరికీ తెలియదు. మరి దీనిపై క్లారిటీ రావాలన్న పవన్ ఫ్యాన్స్ సందేహం తీరాలన్న అధికారిక ప్రకటన రావాల్సిందే.