పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ..సినిమాలతో సంబంధం లేకుండా కల్ట్ ఫాలోయింగ్‌ను సంపాదించుకున్న ఏకైక హీరో .ఇండస్ట్రీ పెద్దలే చెబుతుండటం గమనార్హం. ముఖ్యంగా స్టైల్‌లో పవన్ కల్యాణ్ సెట్ చేసిన ట్రెండ్‌ను టాలీవుడ్‌లోని అనేకమంది హీరోలే ఫాలో అవుతుండటం తెలిసిన విషయమే.
తాజాగా.. మరో క్రేజీ కాస్టూమ్‌తో పవన్ కల్యాణ్ ట్రెండ్ క్రియేట్ చేయడానికి సిద్ధమయ్యారు. ఏపీలో జనసేన ఆధ్వర్యంలో నిర్వహించబోయే బీసీ సమావేశానికి పవన్ కల్యాణ్ ఆర్మీ ప్యాంట్, బ్లాక్ టీ-షర్ట్‌లో ఎయిర్‌పోర్టుకు వచ్చారు.
దానికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ లుక్‌తో ఒక ఫుల్ లెంగ్త్ సినిమా పడాలి అంటూ ట్విట్టర్‌లో కామెంట్లు పెడుతూ ట్రెండ్ చేస్తున్నారు.