పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు తన కెరీర్ లో ఈ స్పీడ్ లో పవన్ సినిమాలు చేసింది లేదు. ప్రస్తుతం పవన్ చేతిలో నాలుగైదు సినిమాలు ఉన్నాయి. అందులో క్రిష్ దర్శకత్వంలో కూడా ఓ సినిమా చేయబోతున్నాడు. అయితే ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి రకరకాల వార్తలు వస్తున్నాయి. తాజాగా టైటిల్ విషయంలో మరో వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.
ఈ సినిమాకి హరిహర వీరమల్లు అనే టైటిల్ ను ఫిలిం చాంబర్లో రిజిస్టర్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే అధికారికంగా ప్రకటన మాత్రం ఎక్కడా వెలువడ లేదు. ఇక ఈ సినిమా ఓ పిరియాడికల్ డ్రామాగా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.