ఇటీవలే వకీల్ సాబ్ మూవీ షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్ తర్వాతి సినిమాలపై దృష్టిపెట్టాడు. త్వరలో క్రిష్ దర్శకత్వంలో ఓ పిరియాడికల్ సినిమాతో పాటు, అయ్యపునమ్ కోష్యిం సినిమాల్లో నటించబోతున్నాడు. అయ్యపునమ్ సినిమాను సింగిల్ షెడ్యూల్ లో పూర్తి చేయబోతున్నాడు. ఈ మూవీల తర్వాత హరీష్ శంకర్ దర్శకత్వంలో మరో మూవీకి ఇప్పటికే సైన్ చేశాడు.
తాజాగా సైరా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇటీవల సురేందర్ రెడ్డి చెప్పిన కథకు పవన్ ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. రామ్ తల్లూరి ఎస్సార్టీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై ఈ మూవీ వచ్చే అవకాశం ఉంది.