ఇక పవర్ ప్రొడ్యూసర్ - Tolivelugu

ఇక పవర్ ప్రొడ్యూసర్

పవర్‌స్టార్ కాస్తా పవర్ ప్రొడ్యూసర్‌గా మారనున్నాడా.. ! ఫ్యామిలీలో నెక్ట్స్ జనరేషన్ కుర్రాళ్ల కోసం తనే సినిమాలు తీయబోతున్నాడా? వినవచ్చిన సమాచారం అదే..

pawan remunerationరాజకీయాల్లో బిజీగా మారిపోయిన పవన్‌కల్యాణ్ త్వరలో మెగా ప్రొడ్యూసర్‌గా మారబోతున్నాడని టాక్! ఆమధ్య అన్నయ్య చిరుని కలిసిన సందర్భంలో ‘రాజకీయాలకు పూర్తిగా అంకితమైపోవడం అభినందనీయమే అయినా.. అప్పుడప్పుడైనా నమ్ముకున్న ఫ్యాన్స్ కోసం మూవీలు చేయాలి తమ్ముడూ..’ అంటూ మెగా బ్రదర్ పవన్‌కల్యాణ్‌కి సున్నితంగా చెప్పారని వార్తలు వచ్చాయ్. పవర్‌స్టార్ సినిమాలు చేయాలని అభిమానుల నుంచే కాదు, తన కుటుంబం నుంచి కూడా బాగా వత్తిడి వుంది. ముఖ్యంగా పవన్‌కల్యాణ్ కెరియర్ ఎదుగుదలకు వెనక నిలబడి ఎంతో సహకరించిన వదినమ్మ ఇప్పుడు తను సినిమాలు వదులుకోకూడదని బాగా వత్తిడి చేస్తున్నట్టు చెబుతున్నారు. అందులో భాగంగానే అన్నయ్య తమ్ముణ్ని పిలిపించి మాట్లాడ్డం. ఇలావుంటే, మెగాస్టార్ మెగా సలహాను తమ్ముడు మరోలా తీసుకున్నట్టుగా కనిపిస్తోంది. పూర్తిస్థాయి రాజకీయాల్లో తలమునకలై వున్న తనకు ఇప్పటికిప్పుడు సినిమాలు చేయడం కుదరకపోయినప్పటికీ, సినిమాలు తీయడం మాత్రం సాధ్యమే అని తను భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. సో, ఇక బిగ్ ప్రొడ్యూసర్ అవతారమెత్తి మెగా ఫ్యామిలీలో స్టార్లుగా వున్న యంగ్ హీరోలతో వరుసగా మూవీలు తీయాలని  డిసైడయ్యారన్నమాట.  బిగ్ స్క్రీన్ కోసం పవర్ స్టార్ సినిమాలు తీయడం ఇదే ఫస్ట్ టైమ్ కాదు. తన స్నేహితుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో కలిసి మెగాభిమాని నితిన్ కోసం పవన్ కల్యాణ్ ఓ మూవీ నిర్మాణంలో భాగస్వామిగా వున్నారు. ఇప్పుడు మాత్రం తన కుటుంబంలో హీరోల కోసం వరుసగా సినిమాలు తీస్తాడని సమాచారం.

పవర్ స్టార్‌గా కలెక్షన్ల సునామీ సృష్టించిన పవన్ కల్యాణ్ ప్రొడ్యూసర్‌గా మారితే అక్కడ కూడా తను సంచలనాలే సృష్టిస్తాడని అభిమానులు మురిసిపోతున్నారు. ముగ్గురు హీరోలకు బెస్ట్ స్టోరీ అప్షన్స్ ఇచ్చారు. ఆ ముగ్గురూ మెగా ఫ్యామిలీ హీరోలే.

ఒకరు రాంచరణ్ తేజ్, మరొకరు వరుణ్ తేజ్ ఇద్దరూ సోదరుల కుమారులు. ప్రతిభావంతులు. ఇక మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ మూడో హీరో. మీకు సరిపడిన మంచి కథలు ఉంటే తీసుకురండి, నేను ప్రొడ్యూసర్‌గా సినిమా తీస్తానని వారికి ఇప్పటికే చెప్పేశారు. ఇక ఎవరు మంచి కథతో ముందు వస్తే వారితో సినిమా తీయడానికి పవన్ సిద్ధంగా ఉన్నారు. ఆల్ ద బెస్ట్ ప్రొడ్యూసర్ పవన్..!

Share on facebook
Share on twitter
Share on whatsapp