పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏం చేసినా అది క్షణాల్లో వైరల్ అవుతుంది. తాజాగా పవన్ కళ్యాణ్ నటిస్తోన్న హరిహర వీరమల్లు మూవీ రెగ్యులర్ షూటింగ్ మొదలు కాబోతుంది. ప్రస్తుతం దీనికి సంబంధించి వర్క్ షాప్ జరుగుతోంది. అయితే వర్క్ షాప్ కు హాజరైన పవర్ స్టార్ ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ పిక్స్ లో పవన్ ధరించిన వాచ్, షూస్ గురించి నెట్టింట తెగ రచ్చ జరుగుతోంది. వాటి ధర ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.
పవన్ కళ్యాణ్ చాలా సింపుల్‌గా ఉంటారు. పొలిటికల్ ప్రెస్ మీట్లలో కూడా ఆయన చాలా సాధరణమైన బట్టల్లో కనిపిస్తుంటారు. హంగు ఆర్భాటలకు పవన్ చాలా దూరమని ఆయన ఫ్యాన్స్ అంటుంటారు. అయితే పవన్ కు సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం వైరల్ అవుతుంది. అత్తారింటికి దారేది సినిమాలో సమంత ఓ డైలాగ్ చెబుతుంది. ‘పవన్ వాచ్ అమ్మితే… మీ బ్యాచ్ మొత్తం సెటిల్ అంటూ’.. సమంత అన్న ఆ డైలాగ్స్ ఇప్పుడు పవన్ విషయంలో అచ్చం నిజమయ్యేలా ఉన్నాయి.
పవన్ పెట్టుకున్న వాచ్ కాస్ట్ చూసి జనం నిజమేనా అని ఆశ్చర్యపోతున్నారు. హరిహర వీరమల్లు మూవీ టీంతో వర్క్ షాప్ కు హాజరయ్యారు పవన్. దీనికి ఆయన రెడ్ టీషర్ట్, జీన్స్, షూస్ ధరించి హ్యాండ్ సమ్ గా ఉన్నారు. ఆయన లుక్ ఫ్యాన్స్ ని పిచ్చ ఫిదా చేసింది. ఈ గెటప్ లో ఓ మూవీ చేయాలని డిమాండ్స్ పెరిగిపోయాయి. ఈ లుక్ లో పవన్ ని టాప్ టు బాటమ్ పరిశీలించిన ఫ్యాన్స్ ఓ విషయాన్ని పసిగట్టారు. పవన్ ధరించిన షూస్, వాచ్ ల బ్రాండ్ నేమ్స్, ధరను ట్రేస్ అవుట్ చేశారు. వీటి ధర తెలుసుకుని వారు షాక్ అవుతున్నారు.
పవన్ ధరించిన వాచ్ రూ.14 లక్షలని, షూస్ రూ.10 లక్షలు అంటూ కొందరు ట్రోల్ చేశారు. అయితే అది నిజం కాదట. నిజానికి పవన్ పెట్టుకున్న వాచ్ ఇటలీ సంస్థ పనేరాయ్ కంపెనీకి చెందిందట. పనేరాయ్ లోని సబ్ మెర్సిబుల్ కార్బోటెక్ 47ఎంఎం అనే మోడల్ వాచ్ అంట. దాని ధర అక్షరాలా రూ.14,37,000 అని తెలిసింది. ఇక షూస్ Copenhagen కంపెనీకి చెందినవట. దీని ధర మాత్రం పది లక్షలు ఉండవని రూ.9,600 వరకు ఉంటుందని అంటున్నారు.
హరిహర వీరమల్లు సినిమాను దర్శకుడు క్రిష్ తెరకెక్కిస్తుండగా, ఏఎం రత్నం నిర్మిస్తున్నారు. ఈ మూవీకి ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఇప్పటి వరకు 40 నుండి 50 శాతం షూట్ పూర్తి చేశారు. ఈ చిత్రం పీరియాడిక్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతుంది. ఇందులో నిధి అగర్వాల్, నర్గీస్ ఫక్రీ, అర్జున్‌రామ్‌పాల్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.