ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా ఆయనకు వైసీపీ కార్యకర్తలు, రాజకీయనాయకులు, సినీ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా విషెస్ లు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు తదితరులు విషెస్ లు తెలిపారు. కాగా జనసేన అధినేత, సినీ నటుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా జగన్ పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియా ద్వారా విషెస్ తెలిపారు.
ఏపీ సీఎం జగన్ రెడ్డి గారికి జన్మదినోత్సవం సందర్భంగా నా తరఫున జనసైనికులు తరపున శుభాకాంక్షలు.. ఆ భగవంతుడు మీకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటున్నాను అంటూ ఓ ప్రకటనను విడుదల చేశారు.