థియేటర్లలో ముగిసిన భీమ్లానాయక్ ప్రభంజనం, ఇప్పుడు ఓటీటీలో షురూ అయింది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్, ఆహా వేదికలుగా “పవర్” తుఫాను ఆరంభమైంది. దాని పేరు “బీమ్లా నాయక్”. ఏ పేరు తలిస్తే అభిమానులకు పండగో… ఏ ఇమేజ్ ఫాన్స్ లో ఉత్సాహం పరవళ్లు తొక్కేలా చేస్తుందో… “పవన్ కళ్యాణ్” అనే ఆ రూపం తన నటనతో అభిమానులను ఉర్రూతలూగిస్తోంది.
“అహంకారానికి ఆత్మగౌరవానికి మధ్య జరిగే యుద్ధం..అహం దెబ్బతింటే అవసరమే ఆయుధం అవుతుంద”ని చెప్పే ఈ సినిమాతో డిస్నీ ప్లస్ హాట్ స్టార్, ఆహా వ్యూయర్స్ పండగ చేసుకుంటున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో తొలిసారిగా యువ కథానాయకుడు రానా దగ్గుబాటి నటించడం ఒక విశేషమైతే మాటలలో ఎన్నో సంచలనాలు సృష్టించిన త్రివిక్రమ్ రచన “బీమ్లా నాయక్” ని వేరే లెవెల్లో నిలబెట్టడం ఇంకో స్పెషాలిటీ.
నిత్యా మేనన్, సంయుక్త మేనన్ హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమా మొదటి నుంచి చివరి వరకు అద్భుతమైన ఫ్లో లో నడుస్తుంది. గ్యాప్ ఇవ్వదు. నెక్స్ట్ ఏం జరుగుతుందా అని ఇంటరెస్ట్ కలిగిస్తుంది. తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకు ప్రాణఁ పోసింది.
నిజానికి ఈ మూవీని ఈరోజు స్ట్రీమింగ్ కు తీసుకురావాలనుకున్నారు. కానీ ఆర్ఆర్ఆర్ థియేటర్లలో వస్తున్న నేపథ్యంలో, ఒక రోజు ముందే భీమ్లానాయక్ ను థియేటర్లలోకి తీసుకొచ్చారు. అలా పవన్ తుఫాను 24 గంటల ముందే మొదలైంది.