పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో యువత నిరుద్యోగ యాత్ర చేయాల్సి రావటం దారుణమని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం మండిపడ్డారు. రాష్ట్రంలో లక్షా 48వేల 16పోస్టులు ఖాళీగా ఉన్నాయని, కొత్త జిల్లాలు, మండలాల్లో 50వేల పోస్టులు ఉన్నాయన్నారు. ప్రభుత్వం వెంటనే ఉద్యోగ క్యాలెండర్ ప్రకటించటంతో పాటు నిరుద్యోగులకు భృతి ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.
ఏపీలో చేసినట్లుగా స్థానికులకే ఉద్యోగాలు కల్పించాలని తెలంగాణలో కూడా చట్టం చేయాలన్న ఆయన, నాగులు లాంటి వారు ఆత్మహత్యకు ప్రయత్నించారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు.కేవలం పట్టా పుస్తకాలు, రిజిస్ట్రేషన్ ల మీద నే కొత్త రెవెన్యూ చట్టం లో మార్పు లు చేశారని, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలకు ఈ చట్టం లో పరిష్కారం చూపలేదని కోదండరాం విమర్శిచంఆరు. కొత్త చట్టంలో సాదా బైనమా, పోడు భూములు, అసైన్డ్ భూముల, కౌలు రైతుల సమస్యల పై క్లారిటీయే లేదని, అసైన్డ్ భూములను రైతుల దగ్గర నుండి బెదిరించి ప్రభుత్వం తీసుకుంటుందని ఆరోపించారు.
స్వామి అగ్నివేష్ మరణం ప్రజాస్వామిక ఉద్యమాలకు తీరని నష్టమని, ఆయన మాట విని మాజీ సీఎం ఎన్టీఆర్ సైతం సన్యాసం తీసుకున్నారన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోదండారం కోరుకున్నారు.