యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం రాధాకృష్ణ దర్శకత్వంలో రాధేశ్యామ్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత ఓం రౌత్ దర్శకత్వంలో ఆది పురుష్ సినిమా చేయబోతున్నాడు. అయితే ఈ సినిమాలో యంగ్ రెబల్ స్టార్ రాముడి పాత్రలో కనిపించబోతున్నాడు. మరోవైపు బాలీవుడ్ స్టార్ నటుడు సైఫ్ అలీ ఖాన్ రావణాసురుడి పాత్రలో నటించబోతున్నాడు. ఈ సినిమా రామాయణం ఆధారంగా తెరకెక్కబోతుంది. సుమారు మూడు వందల కోట్ల రూపాయలతో నిర్మితమవుతున్న ఈ సినిమా పై అంచనాలు తారా స్థాయిలో ఉన్నాయి.
ఇదిలా ఉండగా ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈనెల 19 నుంచి ప్రారంభం కానుంది. మొదటి షెడ్యూల్ లో ప్రభాస్, సైఫ్ అలీ ఖాన్ లు పాల్గొనబోతున్నారట. వీరితో పాటు మరికొందరు సీనియర్ నటులు కూడా ఈ షెడ్యూల్ లో పాల్గొననున్నారని.. అయితే ఈ షెడ్యూల్ ముంబై ఫిల్మ్ స్టూడియో లో చేయనున్నారని సమాచారం.