అందరు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసి ఆదిపురుష్ టీజర్ రిలీజ్ అయ్యింది. ఈ సినిమాలోని సన్నివేశాలను చూసి అద్భుతం అని కొందరు అంటుంటే… కొందరు మాత్రం చాలా లోపాలు కనిపిస్తున్నాయని వివరిస్తున్నారు. సీన్లు బాగానే ఎంచుకున్నా.. గ్రాఫిక్స్, వీఎఫ్ఎక్స్ అస్సలు సూట్ కాలేదన్నది కాదనలేని వాస్తవం.
‘ఆర్ఆర్ఆర్’ సినిమాలోని పులులు, జంతువులు అన్నీ కూడా నేచురల్ గా ఉన్నాయి. కానీ ‘ఆదిపురుష్’ లోని కోతులు, ఇతర జంతువులను చూస్తే బొమ్మల కొలువు చూసినట్టుగా ఉందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.హిందూ సంస్కృతి, సంప్రదాయాల్లో రామాయణాన్ని పోలినది ఏదీ లేదు.. ఎవర్ గ్రీన్ రాముడిని చూపించే విషయంలో ఈ కాలానికి అనుగుణంగా నాటి అద్భుతమైన కళారూపాలను ప్రదర్శించాలి.
రామాయణాన్ని మరింత అద్భుతంగా తెరకెక్కించే సాంకేతికత మనకిప్పుడు అందుబాటులో ఉంది. దాన్ని ఎంతో గ్రాండ్ గా తీయవచ్చు. ఆర్ఆర్ఆర్ కానీ.. హాలీవుడ్ సినిమాల్లో కానీ ఆ నేచురాలిటీ మిస్ కాలేదు. కానీ ఆదిపురుష్ లో గ్రాఫిక్స్ వీఎఫ్ఎక్స్ లో అస్సలు సెట్ కాలేదన్నది అభిమానుల మాట..‘ఆదిపురుష్’ సినిమా టీజర్ పై కామన్ ఆడియన్స్ తోపాటు ప్రభాస్ ఫ్యాన్స్ కూడా నిరాశ చెందుతున్నారు.
యానిమేటెడ్ లా ఉందని.. వీఎఫ్ఎక్స్ అస్సలు బాగాలేదని కామెంట్ చేస్తున్నారు. ఇది నార్మల్ సినిమానా? లేక బొమ్మల సినిమానా? అని సందేహ పడుతున్నారు. అచ్చం రజినీకాంత్ కొచ్చాడియాన్ సినిమాలా ఉందంటూ కామెంట్ చేస్తున్నారు. ఇక ప్రభాస్ ను కోరమీసాలతో చూపించే లుక్ కూడా ఏమాత్రం బాగాలేదని.. అసలు నచ్చలేదని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ఆదిపురుష్ సినిమాను సహజత్వానికి దూరంగా తీశారని దర్శకుడు ఔం రౌత్ పై విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ టీజర్ గమనిస్తే కొన్ని సంప్రదాయాలను ఆయన బ్రేక్ చేశారు. ముఖ్యంగా రాముడు, రావణాసురుడు లుక్స్ మనం చూసిన దానికంటే భిన్నంగా ఉన్నాయి. రామాయణంలో రాముడికి మీసం ఉంటుందనే కాన్సెప్ట్ లేదు. కానీ ఆదిపురుష్ లో ‘ప్రభాస్’కు దర్శకుడు కోరమీసం పెట్టాడు.
ఇక రావణాసురుడిగా సైఫ్ అలీఖాన్ హెయిర్ కట్ పై దుమారం చెలరేగుతోంది. హీరోలు, విలన్లు ఎలా ఉంటే అలా ఓంరౌత్ చూపించేశాడని.. కథలో భాగంగా మార్పులు చేయలేదని విమర్శలు వినిపిస్తున్నారు. సైఫ్ అలీఖాన్ అవతారం చూస్తే మోడ్రన్ రావణాసురుడిని తలపిస్తున్నాడు.
రాముడు, రావణాసురుడి క్యాస్టూమ్స్ విషయంలోనూ ఓం రౌత్ సంప్రదాయాలు ఆచరించలేదు. రావణాసురుడు ఎప్పుడూ పంచెకట్టు, కిరీటం, ఒంటినిండా నగలు, చేతిలో కత్తి వంటి ఆయుధాలు పట్టుకుంటాడు.
కానీ ఆదిపురుష్ లోని రావణాసురుడి గెటప్ కంప్లీట్ డిఫెరెంట్ గా ఉంది. ఇలా మన సంస్కృతి సంప్రదాయాలు లోపించడం.. విజువల్ ఎపెక్ట్స్ అస్సలు సూట్ కాలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అభిమానుల అంచనాలకు ఏమాత్రం అందుకోలేదని అంటున్నారు. వచ్చే సంక్రాంతిలోపు అయినా దీన్ని వీఎప్ెక్స్ సరిగా తీర్చిదిద్దాలని సూచిస్తున్నారు.