పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న చిత్రం వకీల్ సాబ్. ఈ మూవీని సంక్రాంతికే రిలీజ్ చేయాలని భావించినప్పటికీ షూటింగ్ వాయిదాలతో సమ్మర్ కు పోస్ట్ పోన్ అయ్యింది. ఇటు ప్రభాస్ నటిస్తున్న రాధేశ్యామ్ మూవీ కూడా సమ్మర్ కే ఫిక్స్ అయ్యింది. దీంతో సంక్రాంతికి సినిమాలు వస్తాయని భావించిన అభిమానులకు నిరాశలో ఉన్నారు.
కానీ ఈ ఇద్దరు హీరోలు తమ ఫ్యాన్స్ ను పండగ పూట అలరించనున్నారు. వకీల్ సాబ్ తో పాటు రాధేశ్యామ్ లు సంక్రాంతి రోజున టీజర్ రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడిప్పుడే గ్లామర్ ఫీల్డ్ పట్టాలెక్కుతున్న సందర్భంగా సంక్రాంతికి పెద్ద ఎత్తున సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఇదే సందర్భంగా పవన్, ప్రభాస్ లు టీజర్స్ విడుదల చేయనున్నారు.