ముందుగా స్వీటీ అనుష్క పెళ్లి…!! ఆ తర్వాతే యుంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మేరేజ్..!! డెసిషన్ ఆల్రెడీ అయిపోయింది. ఎక్కడ అనుష్క కనిపిస్తే అక్కడ త్వరగా పెళ్లి చేసుకో మై ఫ్రెండ్ –అని ప్రభాస్ చెప్పేస్తాడట..! సాహో ప్రీ రిలీజ్ ప్రమోషన్‌లో యమా బిజీగా ఉన్న ప్రభాస్‌కు రిపీట్ కొశ్చన్ ఎదురైంది. అనుష్క- మీరు బెస్ట్ ఫ్రెండ్స్ కదా.. డేటింగ్‌లో ఉన్నారా..!? మీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారా..? అని మీడియా మళ్ళీ మళ్లీ గుచ్చి గుచ్చి ప్రశ్నించే సరికి ప్రభాస్‌కి యమా చిరాకేసింది. అనుష్క పెళ్లయినా కావాలి.. లేదా నా పెళ్లయినా కావాలి. అప్పుడే ఈ రిపీటేడ్ కొశ్చన్ రాదు. అనుష్క కనపడగానే ఎవరైనా అబ్బాయిని చూసుకుని పెళ్ళిచేసుకోమని సలహా ఇస్తానని షార్ప్‌గా బదులిచ్చాడు.
ప్రభాస్ సమాధానం చూస్తే తన పెళ్ళికి ఇంకా టైమ్ ఉందని చెప్పకనే చెప్పినట్టు ఉంది. త్వరలో ఆయన పెళ్ళికి సిద్దంగా ఉన్నారని వస్తున్న వార్తల్లో నిజం లేదన్న మాట. రూమర్స్ ఆగాలంటే ముందుగా పెళ్లి చేసుకోమని ప్రభాస్ ఇచ్చే సలహాను అనుష్క పాటిస్తుందా..? వెంటనే వరుడిని చూసుకుని పెళ్లి వేసుకుంటుందా..? ప్రభాస్ సలహాకు ఏవిధంగా తను రియాక్టవుతుందో చూడాలి మరి..?