టాలీవుడ్‌లో మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్‌లర్ ప్రభాస్ పెళ్లికి ముహుర్తం ఫిక్స్ అయింది. బాహుబలి సినిమాల తర్వాత ప్రభాస్ పెళ్లి ఉంటుందని కొందరు, సినీ ఇండస్ట్రీలోనే ప్రభాస్ కాబోయే భార్య ఉందని కొందరు ఇలా రకరకాల ప్రచారం జరిగింది. ఫైనల్‌గా ఈ వార్తలకు ప్రభాస్ పెద్దనాన్న కృష్ణంరాజు భార్య శ్యామలాదేవీ పుల్‌స్టాప్ పెట్టారు.
ప్రస్తుతం జాన్ సినిమాతో బిజీగా ఉన్న ప్రభాస్… సినిమాను 2020లో పూర్తి చేయనున్నారు. ఆ సినిమా పూర్తికాగానే ప్రభాస్ పెళ్లిపీటలు ఎక్కుతాడని, సరైన అమ్మాయి కోసం ఇప్పటికే సంబంధాలు చూస్తున్నామని ఆమె తెలిపారు. ప్రభాస్ పెళ్లికోసం అభిమానులకు ఎంత ఆతృత ఉందో… తాము కూడా అంతే ఆతృతతో పెళ్లి కోసం ఎదురు చూస్తున్నామని ఆమె స్పష్టం చేశారు. తమ కుటుంబంలో కలిసిపోయే అమ్మాయి కోసం చూస్తున్నామని, ప్రభాస్ పెళ్లిపై వస్తున్న వార్తలు చూసి తాము కూడా నవ్వుకుంటామని తెలిపారు.