ప్రభాస్ బాలీవుడ్ మూవీపై వస్తున్న ఊహాగానాలు ఇప్పటివి కావు. దాదాపు రెండేళ్లుగా ప్రభాస్ హిందీ సినిమాపై రూమర్స్ వస్తూనే ఉన్నాయి. ఓ భారీ యాక్షన్ సినిమాలో నటిస్తాడంటూ గాసిప్స్ వస్తున్నాయి. అవన్నీ నిజమేనని క్లారిటీ ఇచ్చింది ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్.
పఠాన్ మూవీ దర్శకుడు సిద్దార్థ్ ఆనంద్ తో ప్రభాస్ ఓ సినిమా చేయబోతున్నాడు. దీనికి సంబంధించి దాదాపు రెండేళ్లుగా వదంతులు వినిపిస్తూనే ఉన్నాయి. వీటిపై మైత్రీ మూవీ మేకర్స్ స్పష్టత ఇచ్చింది. ఈ ఏడాదిలోనే సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా సినిమా స్టార్ట్ అవుతుందని క్లారిటీ ఇచ్చింది.
ఇదొక భారీ యాక్షన్ ఎంటర్ టైనర్. పైగా మల్టీస్టారర్ కూడా. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈ సినిమాలో హృతిక్ రోషన్ కూడా నటించే అవకాశం ఉందంటున్నారు. పఠాన్ విడుదల తర్వాత ఈ ప్రాజెక్టుపై మరింత స్పష్టత రానుంది.
ప్రస్తుతం ప్రభాస్ చాలా బిజీగా ఉన్నాడు. సలార్ సినిమాను పూర్తి చేస్తున్నాడు. ప్రాజెక్ట్-కె కూడా లైన్లో ఉంది. వీటితో పాటు మారుతి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. అటు స్పిరిట్ అనే సినిమా కూడా లైన్లో ఉంది. ఇన్ని ప్రాజెక్టుల మధ్య ఈ బాలీవుడ్ సినిమా పట్టాలపైకి వస్తుందా అనేది అందరి అనుమానం.