గోపీచంద్ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం సీటిమార్. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమాలో గోపీచంద్ ఆంధ్ర మహిళా కబడ్డీ జట్టు కోచ్ గా, అలాగే తెలంగాణ మహిళా కబడ్డీ జట్టు కోచ్ గా తమన్నా నటించింది. అయితే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ను మేకర్స్ ఘనంగా నిర్వహించారు.
నిజానికి ఈవెంట్ కి ప్రభాస్ గెస్ట్ గా రాబోతున్నాడు అని అందరూ అనుకున్నారు. కానీ వీలు కాలేదు. అయితే ట్రైలర్ చూసి కాల్ చేసి చాలా బాగుంది రా అన్నాడట ప్రభాస్. ఇదే విషయాన్ని స్వయంగా గోపీచంద్ చెప్పారు. కాగా ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే.